అలొవెరా.. టీ బ్యాగ్‌..  | Beauty tips:Winter lips are drying | Sakshi
Sakshi News home page

అలొవెరా.. టీ బ్యాగ్‌.. 

Dec 11 2018 12:17 AM | Updated on Dec 11 2018 12:17 AM

Beauty tips:Winter lips are drying - Sakshi

చలికాలం పెదవులు పొడిబారడం సహజంగా జరుగుతుంటుంది. ఈ సమస్యకు విరుగుడుగా.. కొబ్బరినూనె, తేనె కలిపి పెదవులపై రాసి, మసాజ్‌ చేయాలి. రోజులో 4 –5 సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పెదవులు పొడిబారడం, పగుళ్ల సమస్యలు తగ్గి, మృదువుగా అవుతాయి. అలొవెరా జెల్‌ చర్మం పగుళ్లను నివారిస్తుంది. రాత్రి పడుకునే ముందు పొడిబారిన పెదవులకు అలొవెరా జెల్‌ని రాయాలి. లేదా రోజ్‌వాటర్‌లో గ్లిజరిన్‌ కలిపి, పడుకునేముందు పెదవులకు రాసుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే పెదవుల చర్మం మృదువుగా అవుతుంది.

గోరువెచ్చని నీటిలో టీ బ్యాగ్‌ ముంచి, పిండి, ఆ బ్యాగ్‌ను పెదవులపై మూడు, నాలుగు నిమిషాల సేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల పెదవుల చర్మంపై తేమ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల పెదవులు పొడిబారకుండా ఉంటాయి.  ఈ కాలం మృతకణాల సంఖ్య అధికంగానే ఉంటుంది. స్నానం చేసిన తర్వాత పొడి టవల్‌ని పెదవులపై ఒత్తిపెట్టి, మృదువుగా రుద్దాలి. దీనివల్ల మృతకణాలు సులువుగా తొలగిపోతాయి. తర్వాత లిప్‌ బామ్‌ రాసుకోవాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement