సున్నితమైన పెదవుల కోసం | beauty tips | Sakshi
Sakshi News home page

సున్నితమైన పెదవుల కోసం

Feb 19 2017 11:47 PM | Updated on Sep 5 2017 4:07 AM

సున్నితమైన పెదవుల కోసం

సున్నితమైన పెదవుల కోసం

పెదవులు పొడిబారి, పగిలి నిర్జీవంగా కనిపిస్తాయి.

బ్యూటిప్స్‌

పెదవులు పొడిబారి, పగిలి నిర్జీవంగా కనిపిస్తాయి. ఒక్కోసారి పెదవులపై డెడ్‌ స్కిన్‌ ఏర్పడుతుంది. దీనిని బలవంతంగా లాగితే రక్తం వస్తుంది. కాబట్టి ఏ సీజన్‌ అయినా పెదవులు సున్నితంగా ఉండేలా తగినంత శ్రద్ధ తీసుకోవాలి. ఇంట్లోనే దొరికే పదార్థాలతో కొన్ని చిట్కాలు మీ కోసం.... పుదీనా లేదా కొత్తిమీర రసాన్ని పెదవులకు రాసుకుని ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. కొన్ని గులాబీ రేకులను పేస్ట్‌ చేసి అందులో గ్లిజరిన్‌ చుక్కలు వేసి రాత్రి పడుకునేటప్పుడు పెదవులకు రాసుకుని ఉదయం కడుక్కోవాలి.
     
ఉదయం లేవగానే పెదవులకు తేనె లేదా పాలమీగడ రాసుకుని పావుగంట సేపు ఉంచుకుని కడిగేయాలి. ఇలా నెలరోజుల పాటు చేస్తే పెదవులు సున్నితంగా ఉండడంతో పాటు గులాబీరంగులోకి వస్తాయి. రాత్రి పడుకునేటప్పుడు కాటన్‌తో పెదవులను తుడుచుకుని కొబ్బరినూనె లేదా వెన్నను అప్లై చేసి రెండుమూడు నిమిషాల పాటు మర్దన చేయాలి.

Advertisement
 
Advertisement
Advertisement