బ్యూటిప్స్ | beauty tips | Sakshi
Sakshi News home page

బ్యూటిప్స్

Sep 6 2016 11:38 PM | Updated on Sep 4 2017 12:26 PM

బ్యూటిప్స్

బ్యూటిప్స్

ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టేబుల్ స్పూన్ బాదం పొడి తగినన్ని నీళ్లు కలిపిన మిశ్రమాన్ని కలిపిన వెంటనే ముఖానికి ప్యాక్



ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టేబుల్ స్పూన్ బాదం పొడి తగినన్ని నీళ్లు కలిపిన మిశ్రమాన్ని కలిపిన వెంటనే ముఖానికి ప్యాక్ వేయాలి. పది- పదిహేను నిమిషాల తర్వాత మెల్లగా మర్దన చేసినట్లు రుద్దుతూ కడగాలి. తర్వాత పన్నీరు కాని మాయిశ్చరైజర్ కాని అప్లై చేయాలి.

ఇది సున్నితమైన చర్మానికి, సాధారణ చర్మానికి చక్కటి మాస్క్. క్రమం తప్పకుండా ఈ మాస్క్ వేస్తుంటే చర్మం బంగారు రంగులో కాంతులీనుతుంది. వారానికి కనీసం రెండుసార్లయినా ఆయిల్‌తో శరీరాన్ని మసాజ్ చేసుకుంటే రక్తప్రసరణ సరిగా జరిగి చర్మం సున్నితంగా, కాంతివంతంగా తయారవుతుంది.
 

 

Advertisement
 
Advertisement
Advertisement