బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కొనేందుకు కొత్త అస్త్రం

Bacteria, a new axis to deal with viruses - Sakshi

అంచనాలు తల్లకిందులవడం సైన్స్‌లో కొత్తేమీ కాదు. ఒకప్పుడు పనికిరావు, విసర్జితాలు అనుకున్న చెడు యాంటీబాడీల విషయంలో ఇప్పుడు అదే రుజువైంది. బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కోవడంలో ఈ చెడు యాంటీబాడీలే మెరుగైన అస్త్రాలుగా మారతాయని గార్వాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా రుజువు చేశారు. శరీరంలోని కణజాలం పైనే దాడి చేయడం మొదలుపెడుతున్న కారణంగా మన శరీరంలోని కొన్ని యాంటీబాడీలు చెడు చేసేవని.. కొంతకాలం తరువాత ఇవి వాటంతట అవే నిర్వీర్యమైపోతాయని ఇంతకాలంగా  శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు.

అయితే ఈ పరిస్థితి కొంతకాలమే అని ప్రొఫెసర్‌ డేనియల్‌ క్రైస్ట్‌ అనే శాస్త్రవేత్త అంటున్నారు. ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఈ చెడు యాంటీబాడీలు కొంతకాలం తరువాత.. శరీరానికి సూక్ష్మజీవుల ద్వారా ముప్పు ఉందని స్పష్టమైనప్పుడు ఇవే వాటిపై పోరాడేందుకు సిద్ధమైపోతాయి అని తాము గుర్తించామని క్రైస్ట్‌ చెప్పారు. రోగ నిరోధక వ్యవస్థ కళ్లు కప్పే బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కోవడంలో ఇవి మరింత మెరుగ్గా పనిచేస్తాయని తాజా అంచనాలు చెబుతున్నాయి. హెచ్‌ఐవీ మొదలుకొని అనేక ఇతర వ్యాధులను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని క్రైస్ట్‌ తెలిపారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top