
అలిగిన వేళనె కదలాలి...
అలిగిన వేళనె కదలాలి... అనుకున్నాడు ఈ చైనీస్ చిన్నోడు. ఎందుకు అలిగాడు..? ఎవరి మీద అలిగాడు..? అంటే, అదంతా ఒక
అలిగిన వేళనె కదలాలి... అనుకున్నాడు ఈ చైనీస్ చిన్నోడు. ఎందుకు అలిగాడు..? ఎవరి మీద అలిగాడు..? అంటే, అదంతా ఒక ప్రేమకథ. వయసుకొచ్చిన చాలామంది కుర్రాళ్లలాగే హి గన్హుయి అనే ఈ చైనీస్ చిన్నోడికీ ఒక గర్ల్‌ఫ్రెండ్ ఉంది. ఏమైందో ఏమో..! మూడేళ్ల కిందట ఇద్దరికీ ఏదో విషయంలో మాటా మాటా వచ్చింది. ప్రియురాలి మీద అలిగిన కోపంతో ఏం చేయాలో తోచలేదతడికి. వెంటనే సైకిలెక్కాడు. చైనాలో గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని తన స్వస్థలం ఫోషాన్ నుంచి ప్రయాణం ప్రారంభించాడు.
మజిలీలు చేస్తూ రాష్ట్రాలు, దేశాలే కాదు, చివరకు ఖండాన్ని దాటి ఇటీవల ఆఫ్రికాకు చేరుకున్నాడు. ఆఫ్రికాలో జాంబియా మీదుగా కెన్యా చేరుకున్నాడు. ఆఫ్రికాలో ప్రయాణిస్తున్నప్పుడు దారిదోపిడీకి కూడా గురయ్యాడు. అయితే, దొంగలు అతగాడి సైకిలును, విలువ తెలియకపోవడంతో క్రెడిట్‌కార్డులను వదిలేశారు. అమాయకపు ఆఫ్రికన్ దొంగలు కనీసం క్రెడిట్‌కార్డులైనా మిగల్చడంతో ఇప్పుడు ఇతగాడు కెన్యాలోని ఒక హోటల్‌లో బసచేయగలుగుతున్నాడు.