ఉబ్బసం వ్యాధి నిర్ధారణకు తేలికైన పరీక్ష

 Lightweight test for asthma diagnosis - Sakshi

ముక్కులో ఉండే ద్రవాలను పరీక్షించడం ద్వారా ఉబ్బసం వ్యాధిని నిర్ధారించేందుకు మౌంట్‌ సినాయి (అమెరికా) శాస్త్రవేత్తలు ఓ సులువైన పద్ధతిని ఆవిష్కరించారు. రైబో న్యూక్లియిక్‌ ఆసిడ్‌ నమూనాలను సేకరించడం ద్వారా ఈ పద్ధతి పనిచేస్తుంది. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో నిర్వహించే పల్మనరీ ఫంక్షన్‌ టెస్ట్‌తో మాత్రమే ఈ వ్యాధిని నిర్ధారించే అవకాశముండగా.. కొత్త పద్ధతి ద్వారా ఎవరైనా ఈ పరీక్షలు పూర్తి చేయడమే కాకుండా... కచ్చితమైన ఫలితాలూ పొందవచ్చు. అంతేకాకుండా ఈ పల్మనరీ ఫంక్షన్‌ టెస్ట్‌ ద్వారా తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశాలూ ఉన్నాయి.

మౌంట్‌ సినాయి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పరీక్షను దాదాపు 190 మంది కార్యకర్తలపై ప్రయోగించి చూసినప్పుడు వారిలో 66 మందికి తక్కువస్థాయి నుంచి ఒక మోస్తరు స్థాయి ఉబ్బసం లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ముక్కులోని ద్రవాల ద్వారా సేకరించిన ఆర్‌ఎన్‌ఏలో ఉబ్బసం వ్యాధిగ్రస్తుల్లో మాత్రమే కనిపించే కొన్ని జన్యుపరమైన అంశాలను గుర్తించడం ద్వారా తాము వ్యాధి నిర్ధారణ చేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్‌ సుపింద బున్‌యావానిచ్‌ తెలిపారు. వివరాలు సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌’ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top