కందుల సోదరులు వైఎస్‌ఆర్‌సీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ కె. సురేష్ బాబు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, లోక్‌సభ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి,
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్: కందుల సోదరులు వైఎస్‌ఆర్‌సీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ కె. సురేష్ బాబు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, లోక్‌సభ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి, కడప శాసన సభ అభ్యర్థి అంజద్ బాష తదితరులు కందుల శివానందరెడ్డి, కందుల రాజమోహన్ రెడ్డిలను శనివారం వారి నివాసంలో కలుసుకున్నారు.
సుమారు రెండుగంటల పాటు జరిగిన చర్చల్లో వివిధ అంశాలు ప్రస్తావనకు వ చ్చినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో కందుల సోదరులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలిసింది.