నేడు విజయమ్మ ఎన్నికల ప్రచారభేరి | ys vijayamma election campaign in Vizianagaram | Sakshi
Sakshi News home page

నేడు విజయమ్మ ఎన్నికల ప్రచారభేరి

Apr 27 2014 2:35 AM | Updated on Aug 14 2018 4:32 PM

నేడు విజయమ్మ ఎన్నికల ప్రచారభేరి - Sakshi

నేడు విజయమ్మ ఎన్నికల ప్రచారభేరి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విశాఖపట్నం జిల్లా లో ని పాడేరు,

 సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విశాఖపట్నం జిల్లా లో ని పాడేరు, అరకు, విజయనగరం జిల్లాలోని ఎస్. కోట, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పర్యటిస్తార ని  పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్సార్ జనభేరిలో భాగంగా పాడేరు, అరకు, ఎస్.కోట నియోజకవర్గాల్లో ఒక్కో చోట నిర్వహి ంచే బహిరంగ సభల్లో విజయమ్మ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మాత్రం రోడ్ షో నిర్వహిస్తారని వెల్లడించారు.
 
 పర్యటన షెడ్యూల్
  ఉదయం 10 గంటలకు పాడేరు నియోజకవర్గంలోని పాడేరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.
 
   మధ్యాహ్నం 12 గంటలకు అరకు నియోజకవర్గంలోని అరకు సభలో ప్రసంగిస్తారు.
   మధ్యాహ్నం 3 గంటలకు ఎస్.కోట నియోజకవర్గంలోని కొత్తవలస బహిరంగ సభలో మాట్లాడుతారు.
   సాయంత్రం 5 గంటలకు విశాఖ దక్షిణ నియోజక వర్గంలోని రెల్లివీధి, 6 గంటలకు కోటవీధి మీదుగా రోడ్ షో నిర్వహించి రాత్రి 7 గంటలకు     మనోరమ థియేటర్‌కు చేరుకుని అక్కడి ప్రజలనుద్దేశించి మాట్లాడడంతో పర్యటనను ముగిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement