మహానేత పథకాలతోనే అందరికి న్యాయం | ys raja shekar reddy welfare schemes | Sakshi
Sakshi News home page

మహానేత పథకాలతోనే అందరికి న్యాయం

Apr 20 2014 2:18 AM | Updated on Jul 7 2018 2:56 PM

మహానేత పథకాలతోనే అందరికి న్యాయం - Sakshi

మహానేత పథకాలతోనే అందరికి న్యాయం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ పటాన్‌చెరు నియోజకవర్గ అభ్యర్థి జి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

వైఎస్సార్ సీపీ పటాన్‌చెరు అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్
 జిన్నారం, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని వైఎస్సార్ సీపీ పటాన్‌చెరు నియోజకవర్గ అభ్యర్థి జి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం జిన్నారం మండలం బొంతపల్లి, గుమ్మడిదల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

 ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మహానేత వైఎస్ సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. తాము చేపట్టే ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శేఖర్, ఆంజనేయులు, చంద్రశేఖర్, నీలం సత్యనారాయణ, సురేష్, కృష్ణ, వెంకటేశ్, మురళి, దేవేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

 పార్టీలో చేరికలు
 రామచంద్రాపురం: పట్టణానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, మైనార్టీ యువకులు వైఎస్సార్ సీపీలో చేరారు. శుక్రవారం రాత్రి, శనివారం పట్టణంలోని పలు చోట్ల పార్టీ ఎన్నికల కార్యాలయాల ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గంలో వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా అనేకమంది లబ్ధి పొందార ని తెలిపారు. వారందరూ వైఎస్సార్ సీపీకి అండగా ఉన్నారని చెప్పారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో నాయకులు రాజు, కృష్ణ, రమేశ్, ప్రసాద్, పవన్, బాలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement