బాబు కోసం లగడపాటి ఆరాటం: వాసిరెడ్డి పద్మ | vasireddy padhma fire to lagadapati raja gopal | Sakshi
Sakshi News home page

బాబు కోసం లగడపాటి ఆరాటం: వాసిరెడ్డి పద్మ

May 5 2014 1:40 AM | Updated on Aug 14 2018 4:24 PM

బాబు కోసం లగడపాటి ఆరాటం: వాసిరెడ్డి పద్మ - Sakshi

బాబు కోసం లగడపాటి ఆరాటం: వాసిరెడ్డి పద్మ

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చంద్రబాబుకు లబ్ధి చేకూర్చాలనే తాపత్రయంతోనే టీడీపీ గెలుస్తుందనే ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.

 హైదరాబాద్: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్  చంద్రబాబుకు లబ్ధి చేకూర్చాలనే తాపత్రయంతోనే టీడీపీ గెలుస్తుందనే ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఆదివారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటే లగడపాటికి తొలి నుంచే ద్వేషమేనని, అందుకే ఆయనపై విషం చిమ్ముతున్నారని చెప్పారు. జగన్‌పై మూడేళ్ల క్రితం నుంచే లగడపాటి విషం కక్కుతూ మాట్లాడుతున్నారన్నారు.

చివరి ప్రయత్నంగా బాబుకు ఉడతా భక్తిగా సాయం చేద్దామని ప్రజాభిప్రాయం పేరిట సీమాంధ్రలో టీడీపీ గెలుస్తుందని లగడపాటి ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయ సన్యాసం పుచ్చుకున్నానని ప్రకటించిన లగడపాటి అంతటితో ఊరుకోక అభిప్రాయాల పేరుతో రాజకీయ విన్యాసాలు చేస్తున్నారని పద్మ  ఎద్దేవా చేశారు. సన్యాసం తీసుకోవడం మాటేమిటోగానీ ఆయన మాత్రం ఒక సన్నాసి అని మండిపడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement