సోనియా హెలీకాప్టర్లో సాంకేతిక లోపం | Technical problem in Sonia Gandhi's Helicopter | Sakshi
Sakshi News home page

సోనియా హెలీకాప్టర్లో సాంకేతిక లోపం

Apr 27 2014 5:39 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయాణించాల్సిన హెలీకాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది.

చేవెళ్ల: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయాణించాల్సిన హెలీకాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం సోనియా రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు వచ్చారు. బహిరంగ సభ అనంతరం మెదక్ జిల్లా ఆందోల్కు వెళ్లాల్సివుంది.

అంతకుముందు ఓ మోస్తారు వర్షం పడటం, ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో సోనియా హెలీకాప్టర్లో వెళ్లేందుకు వీలు కాలేదు. దీంతో సోనియా రోడ్డు మార్గాన కారులో బయల్దేరారు. ఆర్మీ హెలీకాప్టర్లో తీసుకెళ్తామని కోరినా అందులో ప్రయాణించేందుకు సోనియా నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement