వైఎస్ఆర్ జిల్లా కాజీపేట మండలం నాగసానిపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దౌర్జన్యానికి పాల్పడ్డారు.
వైఎస్ఆర్ జిల్లాలో బోణీ కూడ కొట్టలేమన్న భయంతో తెలుగుదేశం పార్టీ అరాచకాలకు దిగుతోంది. కాజీపేట మండలం నాగసానిపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దౌర్జన్యానికి పాల్పడ్డారు.
మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ అక్కడి పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను బయటకు లాగేసి రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నించారు.