‘స్థానిక’ ఎన్నికల కేసు విచారణ నేడు | supreme court adjourned local body polls case to today | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎన్నికల కేసు విచారణ నేడు

Mar 26 2014 2:04 AM | Updated on Sep 2 2018 5:20 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కేసు విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కేసు విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఈ కేసును మంగళవారమే విచారించాలని ఎన్నికల సంఘం న్యాయవాది మనోజ్ సక్సేనా సుప్రీంకోర్టును అభ్యర్థించారు. దీంతో ఈ కేసును మధ్యాహ్నం 2 గంటలకు విచారిస్తామని జస్టిస్ జ్ఞానసుధామిశ్రా, జస్టిస్ గోపాలగౌడ్‌లతో కూడిన ధర్మాసనం తొలుత ప్రకటించింది. అయితే, కేసుల విచారణ జాబితాలో ఇది లేనందున బుధవారం విచారిస్తామని న్యాయమూర్తులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement