'టీడీపీ పేరును కాంగ్రెస్ దేశంగా మార్చుకోండి' | should change TDP name congress pradesh, says actor giribabu | Sakshi
Sakshi News home page

'టీడీపీ పేరును కాంగ్రెస్ దేశంగా మార్చుకోండి'

Apr 19 2014 1:06 PM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి పూర్తిస్థాయిలో శ్రమిస్తానని సినీనటుడు గిరిబాబు తెలిపారు.

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి పూర్తిస్థాయిలో శ్రమిస్తానని సినీనటుడు గిరిబాబు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించనున్నట్లు ఆయన శనివారమిక్కడ చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నదే తన తాపత్రయమని గిరిబాబు తెలిపారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేది జగన్ మాత్రమేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసమే చంద్రబాబు నాయుడు ఆరాటపడుతున్నారని గిరిబాబు విమర్శించారు. చంద్రబాబు సహా ఆ పార్టీలో ఉన్నది కాంగ్రెస్ నేతలేనని , టీడీపీ పేరును కాంగ్రెస్ దేశంగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement