జగన్‌తోనే ఆర్టీసీకి భరోసా | rtc ensuring with jagan | Sakshi
Sakshi News home page

జగన్‌తోనే ఆర్టీసీకి భరోసా

Apr 10 2014 2:29 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే ఆర్టీసీ మనుగడకు భరోసా లభిస్తుందని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎం.వి.కుమార్ అన్నారు.

కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్ :   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే ఆర్టీసీ మనుగడకు భరోసా లభిస్తుందని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎం.వి.కుమార్ అన్నారు. ఇటీవలే వైఎస్సార్‌సీపీలో చేరిన ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ మహమూద్‌ను ఆయన బుధవారం హైదరాబాదులో కలిశారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌ఎంయూ, వైఎస్సార్‌ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్లు కూడా జగన్ ముఖ్యమంత్రి కావాలని జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సంస్థ మనుగడ కోసం యూనియన్లను పక్కనపెట్టి వైఎస్సార్‌సీపీని గెలిపించాలని సయ్యద్ మహమ్మద్ కార్మికులకు సూచించినట్లు ఎంవీ కుమార్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement