ట్రాన్స్పోర్టర్ ఇంట్లో రూ. 8.7 కోట్ల స్వాధీనం | Rs 8.7 crore cash seized in Karnataka | Sakshi
Sakshi News home page

ట్రాన్స్పోర్టర్ ఇంట్లో రూ. 8.7 కోట్ల స్వాధీనం

Apr 12 2014 5:18 PM | Updated on Aug 14 2018 4:21 PM

కర్ణాటకలోని బళ్లారి పట్టణంలో ఒక ట్రాన్స్పోర్టర్ ఇంట్లో 8.7 కోట్ల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కర్ణాటకలోని బళ్లారి పట్టణంలో ఒక ట్రాన్స్పోర్టర్ ఇంట్లో 8.7 కోట్ల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాబూలాల్ అనే వ్యక్తి రవాణా వ్యాపారంతో పాటు ఫైనాన్స్ వ్యాపారం కూడా చేస్తుంటాడని, అతడి ఇంట్లో సోదాలు చేయగా వెయ్యి రూపాయలు, 500 రూపాయల నోట్ల కట్టలు లభించాయని బళ్లారి అదనపు ఎస్పీ సి.కె. బాబా తెలిపారు. వీటి మొత్తం విలువ రూ. 8.7 కోట్లని ఆయన చెప్పారు.

అలాగే ఈ సోదాలో రూ. 4.5 కోట్ల విలువ చేసే చెక్కులు కూడా లభించాయని, మరో రూ. 5 కోట్ల విలువైన షేర్ సర్టిఫికెట్లు, డిబెంచర్లు కూడా ఉన్నాయని అన్నారు. బాబూలాల్పై కేసు నమోదు చేశామని, వచ్చేవారం జరగబోయే ఎన్నికల్లో పంచడానికే ఇంత భారీ మొత్తం నగదు సిద్ధం చేసుకున్నారన్న సమాచారం మేరకు సోదా చేశామని అదనపు ఎస్పీ బాబా వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement