పార్లమెంట్‌కు ఎంపికైన ప్రజాప్రతినిధులు జనం సమస్యలపై గళం విప్పి చట్టసభల్లో నినదించాలని కోరుకుంటాం. అదే ఓ జాతీయ పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న నాయకుడి స్థానంలోని వ్యక్తి ఇంకెంత బాధ్యతగా వ్యవహరించాలి? ప్రభుత్వంలో ఉన్నా సరే గాడి తప్పితే సరైన దారిన పెట్టాలి.
లోక్‌సభలో ఆయన పనితీరు పేలవం
ఎస్‌ఎన్‌ఎస్ సర్వే
న్యూఢిల్లీ: పార్లమెంట్‌కు ఎంపికైన ప్రజాప్రతినిధులు జనం సమస్యలపై గళం విప్పి చట్టసభల్లో నినదించాలని కోరుకుంటాం. అదే ఓ జాతీయ పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న నాయకుడి స్థానంలోని వ్యక్తి ఇంకెంత బాధ్యతగా వ్యవహరించాలి? ప్రభుత్వంలో ఉన్నా సరే గాడి తప్పితే సరైన దారిన పెట్టాలి.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ మాత్రం తన ఐదేళ్ల పదవీకాలంలో లోక్‌సభలో ఒక్కసారీ నోరు విప్పలేదు. సభకు ఆయన హాజరైంది కూడా 42.61 శాతమే. దేశంలో అత్యంత పేలవమైన పనితీరు కనపరచిన ఎంపీల జాబితాలో రాహుల్‌కు చోటు దక్కింది.
‘సతర్క్ నాగరిక్ సంఘటన్(ఎస్‌ఎన్‌ఎస్)’.. సమాచార హక్కు చట్టం, ప్రభుత్వ వెబ్‌సైట్‌ల ద్వారా సేకరించిన వివరాల ప్రకారం మన ఎంపీల గురించి పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. దేశంలో అత్యంత పేలవమైన పనితీరు కనపరిచిన 10 మంది ఎంపీల్లో రాహుల్‌గాంధీ 5వ స్థానంలో ఉన్నారు. ళీ రాహుల్ కేవలం రెండు చర్చల్లోనే పాల్గొన్నారు. పార్టీల వారీగా చూసే పనితీరులో రాహుల్ 355వ స్థానంలో నిలిచారు. లోక్‌సభలో కనీసం ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా రాహుల్ సంధించలేదు.