breaking news
government web site
-
2019 ఆసియా క్రీడలను నిర్వహించలేం
తేల్చి చెప్పిన వియత్నాం హనోయి: ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లకు ఆతిథ్యం ఇచ్చేందుకు ప్రతీ దేశం ఎదురుచూస్తుంటుంది. ఆ అవకాశం దక్కాలే కానీ తమ సత్తా చూపేందుకు సిద్ధమవుతుంటాయి. కానీ వియత్నాం పరిస్థితి అలా లేదు. 2019లో జరిగే 18వ ఆసియా గేమ్స్‌ను నిర్వహించేందుకు ఈ దేశం అర్హత సాధించింది. కానీ అందివచ్చిన ఈ అవకాశాన్ని ఇప్పుడు కాదనుకుంటోంది. ఇలాంటి పెద్ద ఈవెంట్స్‌ను గతంలో నిర్వహించిన అనుభవం లేకపోవడంతో పాటు, దేశంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వియత్నాం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ విషయమై ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఆసియా (ఓసీఏ)తో చర్చిస్తామని ప్రభుత్వ వెబ్సైట్లో పేర్కొంది. ఈ గేమ్స్ నిర్వహణకు కొత్త స్టేడియాలు, అథ్లెటిక్స్ విలేజి నిర్మాణాలకు 150 మిలియన్ల డాలర్లు ఖర్చు కాగలవని అధికారులు అంచనా వేశారు. కానీ వాస్తవంగా అంతకు మించే అవుతుందని నిపుణులు తేల్చిచెప్పారు. అంతులేని అవినీతితోపాటు బ్యాంకింగ్ రంగాల్లో నష్టాలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో వెంటనే ఈ గేమ్స్ నిర్వహణ నుంచి తప్పుకుని ఆ వ్యయాన్ని ఇతర ముఖ్య అవసరాలకు వినియోగించాలని కొద్దికాలంగా దినపత్రికలు, ఇంటర్నెట్ బ్లాగ్స్లో వ్యాసాలు, కథనాలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో వియత్నాం ఆసియా గేమ్స్ నుంచి తప్పుకునేందుకే నిర్ణయం తీసుకుంది. -
రాహుల్ ర్యాంక్ 355
లోక్‌సభలో ఆయన పనితీరు పేలవం ఎస్ఎన్ఎస్ సర్వే న్యూఢిల్లీ: పార్లమెంట్‌కు ఎంపికైన ప్రజాప్రతినిధులు జనం సమస్యలపై గళం విప్పి చట్టసభల్లో నినదించాలని కోరుకుంటాం. అదే ఓ జాతీయ పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న నాయకుడి స్థానంలోని వ్యక్తి ఇంకెంత బాధ్యతగా వ్యవహరించాలి? ప్రభుత్వంలో ఉన్నా సరే గాడి తప్పితే సరైన దారిన పెట్టాలి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ మాత్రం తన ఐదేళ్ల పదవీకాలంలో లోక్‌సభలో ఒక్కసారీ నోరు విప్పలేదు. సభకు ఆయన హాజరైంది కూడా 42.61 శాతమే. దేశంలో అత్యంత పేలవమైన పనితీరు కనపరచిన ఎంపీల జాబితాలో రాహుల్‌కు చోటు దక్కింది. ‘సతర్క్ నాగరిక్ సంఘటన్(ఎస్ఎన్ఎస్)’.. సమాచార హక్కు చట్టం, ప్రభుత్వ వెబ్సైట్ల ద్వారా సేకరించిన వివరాల ప్రకారం మన ఎంపీల గురించి పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. దేశంలో అత్యంత పేలవమైన పనితీరు కనపరిచిన 10 మంది ఎంపీల్లో రాహుల్‌గాంధీ 5వ స్థానంలో ఉన్నారు. ళీ రాహుల్ కేవలం రెండు చర్చల్లోనే పాల్గొన్నారు. పార్టీల వారీగా చూసే పనితీరులో రాహుల్ 355వ స్థానంలో నిలిచారు. లోక్‌సభలో కనీసం ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా రాహుల్ సంధించలేదు.