బాబు తరఫున లోకేష్ నామినేషన్ | Nara Lokesh submits nominations of Chandrababu Naidu in kuppam | Sakshi
Sakshi News home page

బాబు తరఫున లోకేష్ నామినేషన్

Apr 18 2014 3:31 AM | Updated on Aug 29 2018 3:37 PM

బాబు తరఫున లోకేష్ నామినేషన్ - Sakshi

బాబు తరఫున లోకేష్ నామినేషన్

చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుుడు తరఫున ఆయన తనయుుడు లోకేష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు.

కోడ్ ఉల్లంఘించిన తమ్ముళ్లు
 కుప్పం, న్యూస్‌లైన్:  చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుుడు తరఫున ఆయన తనయుుడు లోకేష్ గురువారం  నామినేషన్ దాఖలు చేశారు. ఉదయుం 11.30 గంటలకు చీవునాయునపల్లె వరదరాజస్వామి ఆలయుంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు గుడి, బడి అనే తేడా లేకుండా తెలుగుదేశం పార్టీ జెండాలను ఏర్పాటు చేసి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు.
 
  పోలీసుల సాక్షిగా చీవునాయునపల్లె వరదరాజస్వామి దేవాలయూన్ని పార్టీ జెండాలతో పసుపువుయుం చేసి అధినేత కుమారుడికి స్వాగతం పలికారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో లోకేష్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాగా, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో స్వయంగా నామినేషన్ వేయలేని కారణంగా చంద్రబాబు గురువారం విజయనగరం జిల్లా బొబ్బిలి కోర్టులో అదనపు ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కె.ఉషాకిరణ్ ఎదుట ప్రమాణపత్రం చదివారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement