టీడీపీ లో సర్వం కాంగ్రెస్ మయం: వెంకయ్య నాయుడు | m venkaiah naidu takes on tdp | Sakshi
Sakshi News home page

టీడీపీ లో సర్వం కాంగ్రెస్ మయం: వెంకయ్య నాయుడు

Mar 21 2014 9:00 PM | Updated on Mar 29 2019 9:18 PM

టీడీపీ లో సర్వం కాంగ్రెస్ మయం: వెంకయ్య నాయుడు - Sakshi

టీడీపీ లో సర్వం కాంగ్రెస్ మయం: వెంకయ్య నాయుడు

టీడీపీ పార్టీపై బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్య నాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీలో కాంగ్రెస్ నేతల చేరికతో ఆ పార్టీ ఉనికిని కోల్పోతుందున్నారు.

విజయవాడ: టీడీపీ పార్టీపై బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్య నాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీలో కాంగ్రెస్ నేతల చేరికతో ఆ పార్టీ ఉనికిని కోల్పోతుందన్నారు. తెలుగుదేశం పార్టీ మొత్తం కాంగ్రెస్ మయం అవుతుందని ఆయన మండిపడ్డారు.  దీనికి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించకోక తప్పదని ఆయన తెలిపారు. శనివారం విజయవాడలో మాట్లాడిన వెంకయ్య నాయుడు.. తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ నాయకులు చేరడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు టీడీపీకి మంచివి కావని స్పష్టం చేశారు.

పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపే అంశంలో అర్డినెన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ దాటవేస్తోందన్నారు. బీజేపీ పొత్తులపై వారంలో స్పష్టత వస్తుందన్నారు.పొత్తులు లేకుంటే ఒంటరిపోరుకైనా సిద్ధంగా ఉన్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement