లోక్‌సభ ఎన్నికలు | leaders are taking help to attract youth from social media | Sakshi
Sakshi News home page

లోక్‌సభ ఎన్నికలు

Mar 21 2014 11:14 PM | Updated on Aug 29 2018 8:56 PM

లోక్‌సభ   ఎన్నికలు - Sakshi

లోక్‌సభ ఎన్నికలు

దేశభవిష్యత్తు యువత చేతిలో ఉందని వివేకానందుడు చెప్పి న మాటలు అక్షరాల సత్యాలవుతున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం యువతలో రాజకీయ చైతన్యాన్ని కలిగిస్తోంది.

దేశభవిష్యత్తు యువత చేతిలో ఉందని వివేకానందుడు చెప్పి న మాటలు అక్షరాల సత్యాలవుతున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం యువతలో రాజకీయ చైతన్యాన్ని కలిగిస్తోంది. ఫేస్‌బుక్, యూట్యూ బ్, ట్విటర్, వాట్సప్.. కాదేది ప్రచారానికి అనర్హం. మూడు షేర్లు, ఆరు కామెంట్లు.. 12 లైక్‌లే యూత్‌లో ఉన్న ఆదరణకు ఆధారం.
 
యువ ఓటరు నాడిని పట్టేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. నేటితరం ప్రచార వేదికగా నిలిచిన సామాజిక ప్రసార మాధ్యమంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఎప్పుడూ ఆన్‌లైన్‌లో ఉండే ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ తరహా రాజకీయ ప్రచారం జాతీయ స్థాయిలో ఉండగా.. ఇప్పుడు మున్సిపల్ స్థాయి ఎన్నికల్లో సైతం సోషల్ ప్రచారం జోరుగా సాగుతోంది.
 
 ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న కేజ్రీవాల్, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడి సోషల్‌మీడియా ప్రచారంలో ముందు వరుసలో ఉన్నారు. సోషల్ మీడియాలో వీరికి యువతలో ఉన్న క్రేజీ అంతాఇంతా కాదు. దీంతో తాము ఓటు వేయడమే కాదు రాజకీయాల్లోకి వచ్చేందుకు వీలుగా యువత ప్రచారం చేసుకుంటోంది.
 
 న్యూఢిల్లీ: అమెరికాలాంటి అగ్ర దేశంలోని ఎన్నికలతోపాటు మనదేశ జాతీయ రాజకీయాల్లోనూ ఇప్పటికే విస్తృతంగా కొనసాగుతున్న సోషల్ మీడి యా ప్రచారం యువతపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. యువతను ఆకర్షించేందుకు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంతో యువతలో కూడా రాజకీయ చైతన్యం పెరుగుతోందని పరిశీలకులు అంటున్నారు.
 
 స్మార్ట్‌ఫోన్‌ల పుణ్యమా అని నేటి యువత సోషల్ నెట్‌వర్క్ సైట్‌లను అధికంగా ఉపయోగించుకుంటుండటంతో.. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. సెల్‌ఫోన్‌లలో యువత ఎక్కువగా ఉపయోగించే ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్, యూ ట్యూబ్, టెలిగ్రాం తదితర అప్లికేషన్‌ల ద్వారా పబ్లిసిటీ మొదలుపెట్టారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న యువ అభ్యర్థులు ఈ ప్రచారంపై ఎక్కువగా దృష్టిపెడుతున్నారు.
 
  తమ బయోడేటా మొదలుకొని పార్టీ కార్యక్రమాల్లో తాను పాల్గొంటున్న ఫొటోలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేసుకుంటూ లైక్‌లు, షేరింగ్, కామెంట్ల కోసం ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాపై పెద్దగా అవగాహన లేని సీనియర్ అభ్యర్థులు సైతం తమ కుటుంబంలో లేదా తన వర్గానికి చెందిన యువకుల సహకారంతో తమ అకౌంట్స్‌ను నిర్వహిస్తున్నారు. తద్వారా వారు ఓటర్లకు చెప్పాలనుకున్న సమాచారాన్ని అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
 
 ఫేస్‌బుక్ యుద్ధాలు..
 ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమే. ఇది పైస్థాయి నేతల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఉంటుంది.
 అయితే ఈ ఎన్నికల్లో సోషల్ మీడియాను విపరీతంగా ఉపయోగిస్తున్న పార్టీలు దాని ద్వారా విమర్శలు గుప్పించుకుంటున్నారు.
 
 తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశం అభివృద్ధి చెందుతుందని ఒక పార్టీ పోస్టు చేస్తుండగా, మరో పార్టీ వారు తమతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని గొప్పగా పోస్టు చేసుకుంటున్నారు. ఆయా పార్టీలకు అభిమానులుగా ఉండే సభ్యులు ఈ పోస్టులకు బాగా స్పందించి లైక్‌లు, కామెంట్‌లు, షేర్‌లు చేస్తున్నారు. అయితే పక్క పార్టీలకు చెందిన అభిమానులు ఒక్కోసారి ప్రత్యర్థి పార్టీల పోస్టులపై వ్యంగ్యంగా కామెంట్ చేస్తూ అభిమానులను రెచ్చగొడుతున్నారు. దీంతో ఇరు పార్టీల అభిమానులు కామెంట్‌లతో గొడవలకు దిగుతున్నారు.
 
 ఒక్క క్షణం ఆలోచించండి..
 నోటుకు ఓటు అమ్ముకునే వారు కొందరైతే తమకేమొస్తుందని అసలు ఓటు హక్కునే వినియోగించుకోని వారు మరికొందరు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే యువత సైతం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
 
 మన తలరాతను నిర్దేశించే వారిని ఎన్నుకునే ఈ సమరంలో మన అభ్యున్నతికి పాటుపడే యువ నాయకులను గెలిపించుకునే అవకాశాన్ని వదులుకోకుండా ఓటు అనే వజ్రాయుధాన్ని విని యోగించాల్సిన అవసరం ఉంది. యువత నడుం బిగించి ఓటర్లను చైతన్యవంతం చేసి వంద శాతం ఓటు హక్కును వినియోగించుకునేలా చేయాలి. అవినీతి రహిత నవశకానికి పునాది వేయాలి.

Advertisement
 
Advertisement
Advertisement