మోడీ వస్తే అంబానీలకే మేలు | He should get a ambanilake | Sakshi
Sakshi News home page

మోడీ వస్తే అంబానీలకే మేలు

Apr 3 2014 1:38 AM | Updated on Aug 15 2018 6:22 PM

నరేంద్రమోడీ అధికారంలోకి వస్తే అంబానీలకే మేలు జరుగుతుంది కాని బీసీలకు కాదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు.

 వృత్తి దారులకు సబ్‌ప్లాన్ అమలు చేయాలి: రాఘవులు

 హైదరాబాద్, నరేంద్రమోడీ అధికారంలోకి వస్తే అంబానీలకే మేలు జరుగుతుంది కాని బీసీలకు కాదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు.తెలంగాణలో బీసీలను ముఖ్యమంత్రిని చేస్తామని చంద్రబాబు పేర్కొనడం ప్రజలను మభ్యపెట్టటానికేనని విమర్శించారు.

బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం ఆధ్వర్యంలో ‘మత్స్యకారుల జీవనోపాధి రక్షణకై ప్రత్యామ్నాయ విధానాలకే ఓటు వేయాలని, అభ్యుదయ వామపక్షాల అభ్యర్ధులను గెలిపించాలనే’ బుక్‌లెట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ వృత్తిదారులకు సబ్‌ప్లాన్‌ను ప్రవేశపెట్టినప్పుడే వారి అభివృద్ది జరుగుతుందని అన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement