'వైఎస్ జగన్పై కావాలనే తప్పుడు కేసులు' | Ex DGP Dinesh Reddy Joins ysr congress party | Sakshi
Sakshi News home page

'వైఎస్ జగన్పై కావాలనే తప్పుడు కేసులు'

Apr 7 2014 12:43 PM | Updated on Jul 25 2018 4:09 PM

'వైఎస్ జగన్పై కావాలనే తప్పుడు కేసులు' - Sakshi

'వైఎస్ జగన్పై కావాలనే తప్పుడు కేసులు'

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ డీపీజీ దినేష్ రెడ్డి వైఎస్ఆర్ సీపీలో చేరారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కావాలనే తప్పుడు కేసులు పెట్టారని రాష్ట్ర మాజీ డీజీపీ దినేష్ రెడ్డి చెప్పారు. ఆరోపణలు రుజువు కాకుండానే ఆయనపై అభియోగాలు మోపడం సరికాదని ఆయన అన్నారు. దినేష్ రెడ్డి సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన లోటస్ పాండ్లో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా దినేష్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని దినేష్ రెడ్డి తెలిపారు.

దివంగత మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలను తాను దగ్గర నుంచి చూశానని అన్నారు.  ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో  వైఎస్ఆర్‌ సీపీలో చేరానని, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడం జగన్‌ కు మాత్రమే సాధ్యమని దినేష్‌రెడ్డి చెప్పారు. పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేయడానికి  సిద్ధంగా ఉన్నానని దినేష్‌రెడ్డి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement