జేపీ.. మోడీ ఫొటో వాడొద్దు: బీజేపీ | don't use the modi photoin election campaign: bjp | Sakshi
Sakshi News home page

జేపీ.. మోడీ ఫొటో వాడొద్దు: బీజేపీ

Apr 28 2014 3:04 AM | Updated on Mar 29 2019 9:01 PM

లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ తన ఎన్నికల ప్రచారం, పత్రికాప్రకటనల్లో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఫొటోను వాడుకోవటం ఏ మాత్రం సరికాదని బీజేపీ పేర్కొంది.

సాక్షి,హైదరాబాద్: లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ తన ఎన్నికల ప్రచారం, పత్రికాప్రకటనల్లో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఫొటోను వాడుకోవటం ఏ మాత్రం సరికాదని బీజేపీ పేర్కొంది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ... తన స్వార్థం కోసం బీజేపీ, మోడీ పేర్లను జేపీ వాడుకోవటాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. తక్షణమే ఆయన తన ప్రచారంలో మోడీ ఫొటోలను తీసేసి చేసిన తప్పును సరిదిద్దుకోవాలని లేకుంటే బీజేపీ కార్యకర్తలు ఆయన్ను నిలదీయాలని మల్లారెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement