టీఆర్‌ఎస్‌ను నమ్మొద్దు: ఎమ్మెల్సీ దిలీప్ | don"t trust the trs | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ను నమ్మొద్దు: ఎమ్మెల్సీ దిలీప్

Apr 22 2014 2:10 AM | Updated on Aug 15 2018 9:06 PM

టీఆర్‌ఎస్‌ను నమ్మొద్దు: ఎమ్మెల్సీ దిలీప్ - Sakshi

టీఆర్‌ఎస్‌ను నమ్మొద్దు: ఎమ్మెల్సీ దిలీప్

ఉద్యమకారులపై దాడులు చేసిన వారికి, ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ రాత్రికిరాత్రే టికెట్లు అమ్ముకున్నారని రాష్ట్రీయ లోక్‌దళ్ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ ఆరోపించారు.

హైదరాబాద్: ఉద్యమకారులపై దాడులు చేసిన వారికి, ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ రాత్రికిరాత్రే టికెట్లు అమ్ముకున్నారని రాష్ట్రీయ లోక్‌దళ్ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ ఆరోపించారు. తెలంగాణ వాదంతో ఓట్లడుగుతూ ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, టీఆర్‌ఎస్ పార్టీని నమ్మొద్దని ఆయన పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమకారులపై దాడులు చేసిన కొండా సురేఖ, మహేందర్ రెడ్డి, ఉద్యమకారులను కాల్చి చంపించిన జలగం వెంగళరావు కుమారుడు జలగం వెంకట్రావు వంటి వారికి టికెట్లిచ్చి అసలైన ఉద్యమకారులకు కేసీఆర్ ద్రోహం చేశారని దిలీప్‌కుమార్ విమర్శించారు

Advertisement
 
Advertisement
Advertisement