ఖమ్మం పట్టణం లోని ఓ గోడౌన్లో భారీగా క్రికెట్ కిట్లు, మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ఓ కాంగ్రెస్ నాయకుడికి చెందిన గోడౌన్గా గుర్తించారు.
ఎన్నికల సమయం దగ్గర పడేకొద్దీ కాంగ్రెస్ నాయకుల ప్రలోభాల పర్వం బాగా ఎక్కువైంది. ఖమ్మం పట్టణం లోని ఓ గోడౌన్లో భారీగా క్రికెట్ కిట్లు, మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ఓ కాంగ్రెస్ నాయకుడికి చెందిన గోడౌన్గా గుర్తించారు.
అక్కడ ఇంకా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఖమ్మంలో విజయం సాధ్యం కాదన్న అనుమానాలు రావడం వల్లే కాంగ్రెస్ నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఇలా మద్యాన్ని, క్రికెట్ కిట్లను సిద్ధం చేసుకుని ఉంటారని అక్కడ ఇతర పార్టీలకు చెందిన నాయకులు అంటున్నారు.