గంటాపై ఈసీకి సీపీఎం ఫిర్యాదు | cpm complains to ec on ganta srinivasarao | Sakshi
Sakshi News home page

గంటాపై ఈసీకి సీపీఎం ఫిర్యాదు

Apr 24 2014 8:19 AM | Updated on Aug 14 2018 4:21 PM

గంటాపై ఈసీకి సీపీఎం ఫిర్యాదు - Sakshi

గంటాపై ఈసీకి సీపీఎం ఫిర్యాదు

విశాఖ జిల్లా భీమిలిలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేస్తున్న గంటా శ్రీనివాసరావుపై ఎన్నికల కమిషన్కు సీపీఎం వర్గాలు ఫిర్యాదు చేశాయి.

విశాఖ జిల్లా భీమిలిలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేస్తున్న గంటా శ్రీనివాసరావుపై ఎన్నికల కమిషన్కు సీపీఎం వర్గాలు ఫిర్యాదు చేశాయి. గంటా అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరాయి.

ప్రభుత్వ కాంట్రాక్టులు నిర్వహిస్తున్న ప్రత్యూష కంపెనీలో గంటా శ్రీనివాసరావు భాగస్వామిగా ఉన్నట్లు సీపీఎం నాయకులు తమ ఫిర్యాదులో తెలిపారు. 11.37 కోట్ల రూపాయల ఆదాయానికి తాను దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో గంటా శ్రీనివాసరావు ఆధారాలు చూపించలేదని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement