తెలుగుదేశం పార్టీ ఎల్‌బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఆర్. కృష్ణయ్యపై మరోసారి దాడి జరిగింది.
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ ఎల్‌బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఆర్. కృష్ణయ్యపై మరోసారి దాడి జరిగింది. ఎల్బీనగర్లోని చైతన్యపురి పోలింగ్ కేంద్రం వద్ద ఆయనపై బుధవారం కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో కృష్ణయ్య వాహనం ధ్వంసం అయ్యింది. ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి అనుచరులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాంతో పోలీసులు సుధీర్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు.
కాగా గతంలో కృష్ణయ్య నామినేషన్ వేసేందుకు వెళుతుండగా స్థానిక టీడీపీ నాయకుడు సామ రంగారెడ్డి అనుచరులు .. కృష్ణయ్య గో బ్యాక్ అంటూ పక్కనే ఉన్న కొబ్బరి బొండాలతో కారుపై దాడిచేశారు. ఈ సంఘటనలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే కృష్ణయ్య సురక్షితంగా బయటపడ్డారు.