తెలంగాణ ఇచ్చామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం ఓ పెద్ద జోక్ అని టీఆర్ఎస్ నాయకుడు కె.కేశవరావు అన్నారు.
తెలంగాణ ఇచ్చామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం ఓ పెద్ద జోక్ అని టీఆర్ఎస్ నాయకుడు కె.కేశవరావు అన్నారు. అసలు తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్కు లేదని, ఉద్యమాల వల్లే తెలంగాణ వచ్చిందని ఆయన చెప్పారు. తెలంగాణ మంత్రులు ఎప్పుడూ ఉద్యమాలు చేయలేదని ఆయన అన్నారు.
తాము సెటిలర్లకు వ్యతిరేకం కాదని తెలిపారు. రాష్ట్రంలో ఇంకా గవర్నర్ పాలన కొనసాగించడంపై తాము సుప్రీంకోర్టులో కేసు వేస్తామని కేకే అన్నారు. టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనమైతే తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయనే తాము దూరంగా ఉన్నామని, తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆరే సరైన వ్యక్తి అని చెప్పారు.