లక్ష్మీపార్వతి
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని మించిన 420 ఎవరూ లేరని దివంగత ఎన్టీఆర్ సతీమణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి తీవ్ర స్థాయిలో విమర్శించారు.
	హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని మించిన 420 ఎవరూ లేరని  దివంగత ఎన్టీఆర్ సతీమణి,  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు అవినీతి బయటపడితే అండమాన్ జైలుకు పంపించాల్సి వస్తుందన్నారు. బాబు బ్లాక్‌మనీకి  బావమరిది హిందూపురం టిడిపి అభ్యర్థి, సినీహీరో బాలకృష్ణ బినామీ అని చెప్పారు. బాలకృష్ణకు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. బాలకృష్ణ ఆస్తులపై విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.
	
	 తండ్రికి ద్రోహం చేసిన చంద్రబాబు వెంట బాలకృష్ణ ఏ విధంగా నడుస్తారు? అని ఆమె ప్రశ్నించారు.  బాలకృష్ణ అవగాహన లేకుండా వైఎస్ జగన్మోహన రెడ్డిని విమర్శిస్తున్నారన్నారు. తన పెద్ద బావమరిది నందమూరి హరికృష్ణను కావాలనే చంద్రబాబు పక్కనపెట్టారని లక్ష్మీపార్వతి అన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
