కేశినేనికి చంద్రబాబు షాక్! | Chandrababu give shock to kesineni nani | Sakshi
Sakshi News home page

కేశినేనికి చంద్రబాబు షాక్!

Apr 13 2014 11:46 AM | Updated on Aug 14 2018 4:21 PM

కేశినేనికి చంద్రబాబు షాక్! - Sakshi

కేశినేనికి చంద్రబాబు షాక్!

కేశినేని నానికి టీడీపీ అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంపై నాని పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లారు.

విజయవాడ: కేశినేని శ్రీనివాస్(నాని)కి టీడీపీ అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంపై నాని పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లారు. విజయవాడ లోక్సభ సీటు ఇచ్చేది లేదని తేల్చిచెప్పడంతో కేశినేని హతాశులయ్యారు. విజయవాడ ఈస్ట్ లేదా పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయనకు పార్టీ కార్యాలయం నుంచి సమాచారం అందినట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నాని సుముఖంగా లేరని సమాచారం.

నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న తనకే ఎంపీ సీటు వస్తుందన్న దీమాతో ఉన్న నాని పార్టీ నిర్ణయంతో అవాక్కయ్యారు. సన్నిహితుల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. తనకు టిక్కెట్టు రాకపోవడంపై చంద్రబాబుతో మాట్లాడిన తర్వాతే స్పందిస్తానని నాని తెలిపారు. వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్‌రావులకు ఇప్పటికే చేయిచ్చిన చంద్రబాబు ఇప్పుడు కేశినేనికి షాక్ ఇచ్చారు. కొత్త పేర్లను తెరపైకి తెచ్చారు. కేఎల్ యూనివర్సిటీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, ఎన్నారై కోమటి జయరాం పేర్లపై అభిప్రాయ సేకరణ జరిపి చంద్రబాబు తనదైన రాజకీయం ప్రదర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement