టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపైనే కేసులు ఎక్కువ | Among cases filed on TDP, Congress party MLAs | Sakshi
Sakshi News home page

టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపైనే కేసులు ఎక్కువ

Apr 18 2014 1:24 AM | Updated on Mar 18 2019 7:55 PM

తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపైనే ఎక్కువ కేసులు నమోదై ఉన్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది.

ఫోరం ఫర్ గుడ్ గవరె ్నన్స్ వెల్లడి
 సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపైనే ఎక్కువ కేసులు నమోదై ఉన్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది. 2009 ఎన్నికల్లో గెలిచి, ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న 87 మంది ఎమ్మెల్యేలపై 203 కేసులు ఉన్నట్లు పేర్కొంది. అందులో టీడీపీకి చెందిన 28 మందిపై 68 కేసులు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన 26 మందిపై 39 కేసులు ఉన్నట్లు తెలిపింది. మిగతా కేసులు ఇతర పార్టీల ఎమ్మెల్యేలపై ఉన్నట్లు వివరించింది.
 
  హైదరాబాద్‌లో గురువారం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి, ఉపాధ్యక్షుడు రావు చెలికాని విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ అంశాలను వెల్లడించారు. గత ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులపై పోలీసులు, ఎన్నికల కమిషన్ చర్యలు చేపడితే 30 శాతం ఎమ్మెల్యేలు ఇపుడు పోటీలో ఉండేవారు కాదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement