విచిత్రనామ రచయిత ఎవరు?

విచిత్రనామ రచయిత ఎవరు? - Sakshi


13, 14 శతాబ్దాల్లో భారతదేశం

 

యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో ఈ చాప్టర్ నుంచి 2 మార్కులకు ప్రశ్నలు తప్పనిసరిగా వస్తాయి. ఈ కాలాన్ని ఢిల్లీ సుల్తాన్‌ల యుగంగా చెప్పవచ్చు. వీరి రాజకీయ, పరిపాలన, ఆర్థిక, సాహిత్య, సాంస్కృతిక రంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. సాహిత్యంలో సియాసత్ నామా- నిజాముల్క్ తుసీ, ఖజాయిస్ ఉల్ పితుహా - అమీర్‌ఖుస్రూ, ఖైర్ ఇ మాజల్స్ - హమీద్ కలందర్, తారీఖ్ ఇ ముబారక్ - షాయయ్యార్ రచించినవి, అమీర్‌ఖుస్రూ, బరాని రచనలు, శిల్పకళలో సాంకేతిక ఆర్చి, డోం, ఢిల్లీ 3వ, 4వ నగరాలు, ఉద్యానవనాలు, లాల్ దర్వాజా, అలై - ఇ- దర్వాజాలు ఎవరు నిర్మించారు? లాంటి అంశాలను చదవాలి.

 2001లో కింది ప్రశ్నను అడిగారు. ప్రశ్న: కిందివాటిలో తప్పుగా జతచేసింది ఏది?

     ఎ)    జాలువారే గోడలు - బాల్బన్

     బి)    సాంకేతిక పద్ధతిలో వచ్చిన డోం- ఖిల్జీలు

     సి)    డబుల్ డోం పద్ధతిలో సమాధులు- లోఢీలు

     డి)    ఢిల్లీకి మొదటి పట్టణం - ఐబక్

 సమాధానం: (ఎ)జాలువారే గోడలు ఘియాజుద్దీన్ తుగ్లక్ తన సమాధిలో ప్రవేశపెట్టాడు. ఆర్థిక విధానంలో.. హకియా-ఇ-షాబ్, కిస్మత్, తకావి, ఉస్‌లుబ్ అంటే ఏమిటి? పరసియా, మైదాన్, ఉర్దు-ఇ-మౌల్ల లాంటి పారిభాషిక పదాల గురించి తెలుసుకోవాలి. హాజిమౌల్లా తిరుగుబాటు (1320), జఫార్‌ఖాన్ తిరుగుబాటు (1391), తైమూర్ దాడి (1398), అహ్మదాబాద్ రాజ్యస్థాపన(1411) లాంటి అంశాలతో పాటు, పగోడా (విజయనగరం) మహ్మది (గుజరాత్), ముజఫరి (మాళ్వా), సికిందరీ (ఢిల్లీ సుల్తాన్) బంగారు నాణేలు ముఖ్యమైనవి.

 

 15,16 శతాబ్దాల్లో భారతదేశం


 15, 16 శతాబ్దాల్లో దక్షిణ భారత విజయనగరం, బహ్మనీ రాజ్యాల సాంస్కృతిక వికాసం, ఢిల్లీ సామ్రాజ్య పతనం, మొగల్ రాజ్య స్థాపనాంశాలు, విజయనగరాన్ని సందర్శించిన యాత్రికులు, బహ్మనీ రాజ్య విచ్ఛిన్నం లాంటివి ప్రధానాంశాలు.

 ఉదా: షేర్షాకు సంబంధించి అవాస్తవమైన అంశం ఏది?    (సివిల్స్ 1996)

     1)    1/3 వంతు పన్ను వసూలు

     2)    రైతులకు కబూఅయత్ పట్టా ఇచ్చాడు

     3)    1/4 వంతు భూమిపన్ను ముల్తాన్‌లో వసూలు

     4)    రూపాయి (వెండి) నాణెం ముద్రించాడు

     ఎ) 1, 2, 4 మాత్రమే

     బి) 1, 4, మాత్రమే

     సి) 1, 3,4 మాత్రమే డి) పైవన్నీ

 సమాధానం: (డి)

 

మొగల్ సామ్రాజ్యానికి సంబంధించి బాబర్ సామ్రాజ్య స్థాపన, హుమాయూన్ షేర్షాతో చేసిన యుద్ధాలు, హుమాయూన్ శిల్పకళ, షేర్షా సంస్కరణలు, అక్బర్ కాలంనాటి మత విధానం, రాజపుత్ర విధానాలు, దక్కన్, మున్సబ్‌దారీ విధానాలు, జహంగీర్ కాలంలో బ్రిటిషర్ల స్థావరాలు, నూర్జహాన్ పాలన, షాజహాన్ స్వర్ణయుగం, ఔరంగజేబు దక్కన్ విధానాలు, చివరి మొగల్ పాలకులు లాంటి అంశాలు ముఖ్యమైనవి. మొగలుల సాంస్కృతిక, ఆర్థిక విధానాలు, సాహిత్య రంగం, చిత్రకళ, సంగీతం మొదలైన అంశాలు కీలకం.

 ‘తారీఖ్ ఇ అక్బరీ’- కాందహారీ, ‘తబాకత్ ఇ అక్బరీ’ - నిజాముద్దీన్, ‘ముంతకాబ్ జల్ తవారిక్’-బదాయని, ‘ఇక్బాల్‌నామా’- ముత్మద్‌ఖాన్ లాంటి గ్రంథాల పేర్లు గుర్తుంచుకోవాలి. మన్సూర్ అలీ పక్షి చిత్రకారుడు, అబ్దుల్‌సమద్-దస్తక్-ఇ- హమీరంజా, తాన్‌సేన్, మిత్ర సింహా, తులసీదాస్ లాంటి వారు సంగీత విద్వాంసులు. శివాజీ పరిపాలన, సాహిత్యం, బక్నర్ మరాఠా సాహిత్యం, కాయత్ రాజస్థాన్ సాహిత్యం, బురుంజీ అస్సాం సాహిత్యం లాంటి అంశాలపై పట్టు అవసరం.

 2011లో యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షలో మొగల్ సాహిత్యానికి సంబంధించి ఎంత లోతైన ప్రశ్న అడిగారో గమనించండి.

 ప్రశ్న: గ్రంథాలు, వాటి రచయితలకు సంబంధించి కింది వాటిలో సరికానిది?

     1)    జాఫర్‌నామా - ఔరంగజేబు లేఖలు

     2)    విచిత్రనామ - హిందూ హీరోల ఆత్మకథలు

     3)    ‘నక్ష ఇ దిల్ కుష్’ - బీమ్‌సేన్

     4)    ‘తారీఖ్ ఇ షేర్షా’ - అబ్బాస్‌ఖాన్

     ఎ) 1, 2 మాత్రమే    బి) 1, 2, 3 మాత్రమే

     సి) 3, 4 మాత్రమే    డి) పైవన్నీ

 సమాధానం: (డి)

 వివరణ: జాఫర్ నామా (ఔరంగజేబు లేఖలు) బహదుర్‌షా-2 రచించారు. హిందూ హీరోల చరిత్రలను (ఆత్మ కథలు) విచిత్రనామా పేరుతో దారాషికో రచించాడు.

 

 బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ


బ్రిటిషర్ల ఆర్థిక, విద్యా విధానాల్లో వచ్చిన సంస్కరణలు, రాజ్యాంగ మార్పులు, పరిపాలనకు చెందిన వివిధ అంశాలు (సివిల్ సర్వీసెస్, పోలీస్, సైనిక, న్యాయవ్యవస్థ) కూలంకషంగా చర్చించాలి. బెంగాల్ గవర్నర్ జనరల్స్, భారత గవర్నర్ జనరల్స్, వైశ్రాయ్‌లు- వారి విధానాలు, బ్రిటిషర్ల నూతన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు, గిరిజనులు, కార్మికులు చేసిన ఉద్యమాలు చాలా ముఖ్యం. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన, బ్రిటిష్ పాలనలో భారతదేశ సాంస్కృతిక, సామాజిక రంగాల్లో వచ్చిన మార్పులపై అవగాహన అవసరం. శంభుమిత్ర నాటక రంగంలో, రాంకిరణ్ శిల్పకళలో, రవివర్మ చిత్రకళలో, ప్రమతీష్ బౌర చిత్ర రంగంలో ప్రసిద్ధి. రుక్మిణీ దేవి క్లాసికల్ డ్యాన్సులో, అల్లావుద్దీన్ ఖాన్ హిందూస్తానీ రాగంలో పేరు పొందారు. బ్రిటిషర్ల నిర్మాణ రంగంలో విక్టోరియా మహల్, సెంట్రల్ సెక్రటేరియట్ (పార్లమెంట్), గేట్‌వే ఆఫ్ ఇండియా, మద్రాస్ యూనివర్సిటీ ముఖ్యమైనవి. ముస్లింల సామాజిక ఉద్యమాలు వాహాబీ, మహ్మదీయ, అహ్మదీయ మొదలైన వాటిపై దృష్టి సారించాలి.

 ప్రశ్న: ఎం.జి.రనడే ‘విధవ వివాహ మండలి’ని ఎవరితో కలిసి ప్రారంభించారు?    (2002)

     ఎ) దారోగా పాండురంగ

     బి) విష్ణుశాస్త్రి    సి) కె. నటరాజన్

     డి) పండిత రమాబాయి

 సమాధానం: (బి)

వివరణ: మహారాష్ర్టలో వితంతు వివాహాల కోసం రనడే, విష్ణుశాస్త్రి కలిసి దీన్ని ప్రారంభించారు. పుణేలో వితంతు గృహాలను పండిత రమాబాయి ‘శారదాసేవాసదన్’ పేరుతో ప్రారంభించారు. ముల్క్‌సదన్ అనేది వితంతువుల కోసం ప్రారంభించిన పాఠశాల. కామాక్షి నటరాజన్ ‘ఇండియన్ సోషల్ రిఫార్మర్’ (1890)ను ప్రారంభించారు.బిటిషర్లకు వ్యతిరేకంగా వచ్చిన సైనిక తిరుగుబాటును స్వాతంత్య్రోద్యమంలో నూతన అధ్యాయంగా చెప్పుకోవచ్చు. కున్వర్‌సింగ్ (బీహార్), అహ్మదుల్లా (ఫైజాబాద్), మంగళ్‌పాండే (బారక్‌పూర్), జినాత్ మహల్ (ఢిల్లీ)ల తిరుగుబాటును జేమ్స్ ఓరం, నికల్సన్, కాంప్‌బెల్, రోస్‌లు అణచివేయడం లాంటి అంశాలపై దృష్టిసారించాలి.

 

 స్వాతంత్య్రోద్యమ చరిత్ర


దీంట్లో మితవాదయుగం (1885-1905), అతివాదయుగం (1905-1920), గాంధీయుగం (1920-1947), విప్లవ వీరుల యుగం (1913-1931) ముఖ్యమైనవి. మితవాదుల ఆలోచనలు, పోరాట పద్ధతులు, వారి విజయాలు, వారి వైఫల్యానికి కారణాలను అధ్యయనం చేయాలి.ఈస్టిండియా అసోసియేషన్ (లండన్), బెంగాల్ బ్రిటిష్ ఇండియా అసోసియేషన్, బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ సంస్థల స్థాపకులు ఎవరు? వాటి ఆశయాలు ఏమిటి? లాంటివి ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి దోహదపడిన పత్రికల పాత్ర కూడా శ్లాఘనీయం. వీటిలో చెప్పుకోదగినవి.. మద్రాస్ కొరియర్, బాంబే హెరాల్డ్, హిందూ పెట్రియాట్(1853), అక్బర్-ఓ-సౌదాగర్ (1852), ఇండియన్ మిర్రర్ (1862), స్టేట్స్‌మెన్ (1875), ట్రైబ్యూన్ (1862). కొన్ని సంస్థలు కూడా తమ వంతు పాత్ర పోషించి భారతీయుల్లో రాజకీయ చైతన్యం, జాతీయవాదం, హేతువాదం, సామ్యవాదాన్ని  ప్రేరేపించడానికి తోడ్పడ్డాయి. అలాంటి వాటిలో కొన్ని.. బ్రిటిష్ ఇండియా సమాజం  (1867) -విలియం ఆడమ్, నేషనల్ ఇండియన్ అసోసియేషన్ (1839)-మేరి కార్పెంటర్, ఇండియన్ సొసైటీ (1872) - ఆనందమోహన్ బోస్ స్థాపించారు. ఈ కాలంలో మహిళల పాత్ర కూడా మర్చిపోలేనిది. అలాంటి వారిలో సరళాదేవి తన ఆత్మకథ- జిబ్నర్ జరా పఠా, లైఫ్ ఫాలెన్ లీవ్‌‌స; పండిత రమాబాయి-ఆర్య మహిళా సమాజం, రామేశ్వరి నె్రహూ (బ్రిజ్‌లాల్ నె్రహూ భార్య)- స్త్రీల సమస్యలపై స్త్రీ దర్పణ్ అనే మాస పత్రిక ద్వారా (1909-1924) పోరాడారు. ఈ దశలో ముస్లింల పాత్రకు సంబంధించి సయ్యద్ అహ్మద్- తారీఖ్-ఇ-మహ్మదీయ, మహ్మద్ కాశీమ్ నేనతవిదారుల్-ఉల్-బెరైల్వి దియోబంద్, మిర్జా గులాం-అహ్మద్-బరాహిం, జకాఉలా ్ల-జిల్లి ఉర్దూ రినైసాన్‌‌స సంస్థలు జాతీయవాదంలో ప్రముఖ పాత్ర పోషించాయి. బ్రిటిషర్లు పత్రికలపై ఉక్కుపాదం మోపడానికి కింది చట్టాలను చేశారు.* వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878

* న్యూస్‌పేపర్ (ఇన్సిట్‌మెంట్ టు ఆఫెన్‌‌స) యాక్ట్ (1905)

* ఇండియన్ ప్రెస్ యాక్ట్ 1910

* ఇండియన్ ప్రెస్(ఎమర్జెన్సీ పవర్స్) యాక్ట్ 1931

 

మరోవైపు సామాజిక సంస్కరణల్లో భాగంగా రనడే-వితంతు గృహాలు (పుణేలో), జ్యోతిబాపూలే-ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్‌‌స, పండిత రమాబాయి-శారదాసేవా సదన్, డి.కె. కార్వే-బాలికల పాఠశాలలను స్థాపించి తమ వంతు కృషి చేశారు.అతివాదుల కాలంలో వచ్చిన జాతీయోద్యమం, రాజకీయ పండుగ లాంటిదని చెప్పొచ్చు. దీనికి కారకుడు లార్‌‌డ కర్జన్. ఇతను రైల్వేలపై (రాబర్‌‌టసన్), వ్యవసాయంపై (మెక్ డొనాల్డ్), విశ్వవిద్యాలయాలపై (ర్యాలీ) కమిటీలు వేశాడు. చివరకు 1905 అక్టోబరు 16న బెంగాల్ రాష్ర్ట విభజన చేశాడు. ఇతడు తన గ్రంథం ‘ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా’లో భారతదేశంలో ఉద్యమాల్లో విద్యార్థుల పాత్రను వివరించాడు. బెంగాల్ రాష్ర్టంలో వచ్చిన పత్రికలు అక్కడి ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించాయి. వీటిలో కొన్ని..

 జీ)    న్యూ ఇండియా - బిపిన్ చంద్రపాల్ (అనిబిసెంట్ పత్రిక పేరు కూడా ఇదే)

 జీజీ)    బందేమాతరం - అరబిందో ఘోష్

 జీజీజీ)    సంధ్య - బ్రహ్మోపాధ్యాయ

 జీఠి)    డాన్ - సతీష్ చంద్ర ముఖర్జీ

 

 వీటితో పాటు పంజాబీ- లాలాలజపతిరాయ్, భారత్‌మాత-అజిత్‌సింగ్, కామ్రేడ్-మౌలానా మహ్మద్ ఆలీ, ఆల్ హిలాల్-మౌలానా అబుల్ కలాం ఆజాద్ పత్రికలు కూడా చెప్పుకోదగినవి.

 ఈ ఉద్యమం ఆంధ్ర రాష్ర్టంపై ప్రభావాన్ని చూపింది. గాంధీజీ రాకతో (1915 జనవరి 9న) స్వాతంత్య్రోద్యమ దశలో నూతన శకం ఆరంభమైనట్లుగా చెప్పుకోవచ్చు. దక్షిణా ఫ్రికాలో గాంధీజీ చేసిన తొలి సత్యాగ్రహం ఏది? అక్కడ స్థాపించిన గాంధీ, టాల్‌స్టాయ్, ఫ్యూనిక్స్ ఆశ్రమాల ఉద్దేశాలు ఏమిటి? ఆఫ్రికా అధ్యక్షుడు జనరల్ స్మట్స్, గాంధీ, గోఖలే మధ్య 1914లో జరిగిన ఒప్పందంలోని నిర్ణయాలు? ‘అన్ టు ది లాస్ట్’గ్రంథాన్ని గాంధీజీ ‘సర్వోదయ’ పేరుతో గుజరాతీలోకి అనువదించడంలోని ఉద్దేశం? 1909లో ‘హిందూ స్వరాజ్’ గ్రంథంలో న్యాయవాదులను, డాక్టర్లను, రైల్వేలను ఎందుకు విమర్శించారు? లాంటి ప్రశ్నలపై విద్యార్థులకు అవగాహన ఉండటం ముఖ్యం.

 భారత్‌లో గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహాలు

 1.    చంపారన్ (1917)- నీలిమందు రైతుల కోసం (శాసనోల్లంఘనోద్యమం).

 2.    ఖేడా (1918)- గుజరాత్‌లోని గిరిజనుల కోసం (సహాయనిరాకరణోద్యమం).

 3.    అహ్మదాబాద్ (1918)-గుజరాత్‌లోని కార్మికుల కోసం (నిరాహార దీక్ష).

 4.    రౌలత్ చట్టం (1919) - దేశవ్యాప్తంగా ‘గాంధీజీ జన బాహుళ్య ఉద్యమం చేసి అన్ని విజయాలు సాధించారు. కానీ జాతీయ నాయకుడిగా చేసిన ఉద్యమాల్లో ఎందుకు విఫలం చెందారు?

     1928-22 సహాయనిరాకరణోద్యమం: దీంతో గాంధీజీ దేశంలో తిరుగులేని నాయకునిగా నిల్చిపోయారు. ఈ ఉద్యమం ప్రారంభించడానికి కారణాలు? చౌరీచౌరా సంఘటన (1922 ఫిబ్రవరి 5న)తో ఎందుకు నిల్పివేశారు? స్వరాజ్య పార్టీ      (1923), అఖిల భారత రాష్ర్ట ప్రజల సంస్థ (1927), కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ (1934), ఫార్వర్‌‌డ బ్లాక్ (1939), భారత కమ్యూనిస్ట్ పార్టీ (1925) ఎందుకు ఆవిర్భవించాయి? వాటి ముఖ్యాంశాలు మొదలైన వాటిపై దృష్టి పెట్టాలి.

 

 మాదిరి ప్రశ్నలు


 1.    ‘మహ్మదరన్ సాహిత్య సమాజం(1863)’ స్థాపకులు ఎవరు?

     (2001 సివిల్స్)

     1) నవాబ్ అబ్దుల్ లతీఫ్

     2) సయ్యద్ అమీన్ ఆలీ

     3) షరియతుల్లా

     4) డాక్టర్ ముత్కార్ అహ్మద్ అన్సారీ

 2.    కింది వాటిలో సరైంది?    (2002 సివిల్స్)

     1) దీనమిత్ర - రామన్ పిళ్లై

     2)    మార్తాండ వర్మ-ముకుంద్‌రావు పాటిల్

     3)    న్యూ ఇండియా- విష్ణు కృష్ణ చిప్లూంకర్

     4) నిబంధన మాల - బిపిన్ చంద్రపాల్

     5) మహానిర్వాణ్ తంత్ర - రాయ్

 వివరణ:

     దీనమిత్ర: నీలిమందు రైతుల గురించి ముకుంద్‌రావు పాటిల్ వివరించాడు.

     మార్తాండ వర్మ: ట్రావెన్‌కోర్ రాజు వివరాలు సి.వి.రామన్ పిళ్లై రచించాడు.

     న్యూ ఇండియా: బిపిన్‌చంద్రపాల్ పత్రిక

     నిబంధన మాల- విష్ణుకృష్ణ చింప్లూకర్ రచన

 3.    కింది వాటిలో తీవ్రవాద సంస్థ - వాటి స్థాపకుల్లో సరికానిది?

     1)    యంగ్ ఇండియా - దామోదర్ సావర్కర్

     2)    హిందూస్తాన్ ప్రజా తాంత్రిక్ సంఘ్ - సూర్యసేన్

     3)    ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ - భగత్‌సింగ్

     4)    భారతమాత - అజిత్‌సింగ్

 వివరణ:

     ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీని సచీంద్ర సన్యాల్ స్థాపించారు.

     భగత్‌సింగ్ ‘నవభారత జవాన్’ను స్థాపించారు.

 4.    గాంధీజీకి సంబంధించి సరికానిది?

     1)    తొలి శాసనోల్లంఘన ఉద్యమం -

 1930 ఏప్రిల్ 6న

     2)    తొలి సహాయనిరాకరణోద్యమం - 1918 ఖేడా ఉద్యమం

     3)    తొలి నిరాహార దీక్ష 1918- గుజరాత్ అహ్మదాబాద్ మిల్లు కార్మికుల కోసం

     4)    తొలి ఆశ్రమం- సత్యాగ్రహ ఆశ్రమం 1915లో స్థాపించారు.

 వివరణ:

తొలి శాసనోల్లంఘన ఉద్యమం గాంధీజీ 1917 చంపారన్ జిల్లా మోతీహారి గ్రామంలో (బీహార్ రాష్ర్టం) చేశారు.

 సమాధానాలు:

     1) 1      2) 5    3) 3    4) 1

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top