వినోదం పన్ను దేనికి ఉదాహరణ? | What does the example of the entertainment tax? | Sakshi
Sakshi News home page

వినోదం పన్ను దేనికి ఉదాహరణ?

Nov 6 2014 10:20 PM | Updated on Jul 11 2019 5:01 PM

కేంద్ర ప్రభుత్వ పన్నేతర రాబడిని మూడు కేటగిరీలుగా విభజించవచ్చు.

కేంద్ర ప్రభుత్వ పన్నేతర రాబడిని మూడు కేటగిరీలుగా విభజించవచ్చు.
 
1.    Currency, Coinage and Mint: కరెన్సీ నోట్ ప్రెస్, సెక్యూరిటీ పేపర్ మి ల్లు, బ్యాంక్ నోట్ ప్రెస్, మింట్ (Mints), చిన్న నాణేల పంపిణీ ద్వారా వచ్చే లాభం ఈ కేటగిరీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పన్నేతర రాబడిగా ఉంటుంది.

2.    వడ్డీ రాబడులు, డివిడెండ్లు, లాభాలు: ప్రభుత్వం ఇతరులకిచ్చిన రుణాలపై వడ్డీతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చే డివిడెండ్లు, లాభాలు ఈ కేటగిరీలో ఉంటాయి. ఉదా: రైల్వేలు, పోస్టల్, కమ్యూనికేషన్‌ల నుంచి వచ్చే ఆదాయం తోపాటు రిజర్‌‌వ బ్యాంక్ మిగులు లాభాలు. ప్రభుత్వం సృష్టించిన ద్రవ్యం నుంచి లభించే ఆదాయం, లాభం కూడా ఇందులోనే వస్తాయి.
 
3.    పన్నేతర రాబడులు: ప్రభుత్వ పరిపాలనా సంబంధమైన సర్వీసులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీస్, జైళ్లు, వ్యవసాయం, దాని అనుబంధ సేవలు, పరిశ్రమలు, ఖనిజాలు, నీరు, విద్యుత్ అభివృద్ధి సర్వీసులు, రవాణా, పబ్లిక్ వర్‌‌క్స, విద్య, గృహ నిర్మాణం, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ, బ్రాడ్‌కాస్టింగ్, గ్రాంట్-ఇన్ - ఎయిడ్ కంట్రిబ్యుషన్‌‌స ఈ కేటగిరీలోకి వస్తాయి. పన్నేతర రాబడిలో ఆరు ముఖ్య గ్రూపుల రాబడి కలిసి ఉంటుంది.
 
     1. Fiscal Services (విత్త సర్వీసులు)
     2. వడ్డీ రాబడులు
     3. డివిడెండ్లు, లాభాలు
     4. సాధారణ సేవలు
     5. సాంఘిక సేవలు
     6. ఆర్థిక సేవలు
 
 కేంద్ర ప్రభుత్వ పన్నేతర రాబడి 1950-  51లో రూ. 48.86 కోట్లు. కాగా 2014-15 బడ్జెట్‌లో రూ. 2,12,504.61 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ మొత్తంలో డివిడెండ్లు, లాభాల వాటా అధికం. తర్వాత ఆర్థిక సేవల ద్వారా వచ్చే రాబడి ఎక్కువ అని తేల్చారు.
 
 రెవెన్యూ వ్యయం
 ప్రస్తుత పన్ను రాబడి ద్వారా వ్యయం చేయగలిగే రెవెన్యూ వ్యయంలో పెరుగుదల 1950-51 తర్వాత ఎక్కువగా ఉంది. 1987-88కి ముందు కాలంలో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ వ్యయాన్ని...
 ఎ.    సివిల్ వ్యయం (సాధారణ సర్వీసులు, సాంఘిక, కమ్యూనిటీ సర్వీసులు, ఆర్థిక సర్వీసులపై వ్యయం)
 బి.    రక్షణ వ్యయం
 సి.    రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గ్రాంట్ - ఇన్- ఎయిడ్ అని మూడు రకాలుగా విభజించారు.
 
 కేంద్ర ప్రభుత్వం తన వ్యయాన్ని అభివృద్ధి వ్యయం, రక్షణ వ్యయం, ఇతర వ్యయం అని కూడా వర్గీకరించింది.
 1987-88 బడ్జెట్ నుంచి కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ వ్యయాన్ని ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం అని రెండు రకాలుగా విభజించింది. 1950-51లో కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయం రూ. 530 కోట్లు కాగా ఈ మొత్తంలో రెవెన్యూ వ్యయం రూ. 350 కోట్లు. రెవెన్యూ వ్యయం 2013-14 బడ్జెట్‌లో సవరించిన అంచనాల ప్రకారం రూ. 13,99,540 కోట్లకు పెరిగింది. 2014-15 బడ్జెట్‌లో ఈ వ్యయాన్ని రూ. 15,68,112 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ మొత్తంలో ప్రణాళికేతర రెవెన్యూ వ్యయం రూ. 11,14,609 కోట్లు కాగా ప్రణాళికా రెవెన్యూ వ్య యం రూ.4,53,503 కోట్లు. ఇటీవల రెవెన్యూ వ్యయంలో పెరుగుదల ఎక్కువగా ఉంది.
 
 ఇందుకు ప్రధాన కారణాలు
 1.    గత ఏడాదిలో తీసుకున్న రుణాలపై వడ్డీ చెల్లింపు.
 2.    సబ్సిడీలపై వ్యయం పెరుగుదల.
 3.    ఎగుమతులపై వ్యయంతోపాటు విదేశీ వ్యవహారాలపై వ్యయం పెరగడం.
 4.    రక్షణ రంగంపై, పౌర పాలనపై ఖర్చు పెరగడం.
 5.    వస్తు, సేవల వినియోగంపై ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల.
 6.    రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్ - ఇన్ - ఎయిడ్ పెరగడం.
 7.    వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, ఇతర సాంఘిక సేవలు, శాస్త్ర పరిశోధనలపై వ్యయం పెంచడం.
 
 1950-51లో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ వ్యయం రూ.350 కోట్లు మాత్రమే. భారత్‌లో పన్ను - జీడీపీ నిష్పత్తి పెంచాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ప్రత్యక్ష పన్ను రేట్లు పెంచడం, కొత్త పన్నులు విధించడం ద్వారా రెవెన్యూ రాబడిని పెంచుకోవాలి. రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉన్నందువల్ల ప్రభుత్వానికి రెవెన్యూ లోటు ఏర్పడుతుంది.
 
 పెరుగుతున్న రెవెన్యూ వ్యయాన్ని క్రమబద్ధీకరించాలంటే ...
 ఎ.    అనుత్పాదక రంగాలపై వ్యయాన్ని తగ్గించాలి.
 బి.    రక్షణ రంగంపై వ్యయాన్ని rationalise చేయాలి.
 సి.    {పభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంలో విద్య, ఆరోగ్య రంగ ప్రాజెక్టులను అనుమతించాలి.
 డి.    {పభుత్వ కార్యకలాపాల పరిధి తగ్గించాలి.
 ఇ.    {పభుత్వం సబ్సిడీ వ్యయాన్ని Rationalise చేయాలి.

 మాదిరి ప్రశ్నలు
 1.    {పభుత్వం ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపట్టినప్పుడు దానివల్ల ప్రయోజనం పొందేవారి నుంచి దశలవారీగా వసూలు చేసేది?
     ఎ) టోల్ ట్యాక్స్    బి) సంపద పన్ను
     సి) ఎస్టేట్స్    డి) ఎస్టేట్ డ్యూటీ
 2.    మొత్తం ప్రభుత్వ వ్యయం నుంచి రుణేతర వసూళ్లను తీసివేస్తే వచ్చేది?
     ఎ) రెవెన్యూ లోటు
     బి) రెవెన్యూ మిగులు
     సి) విత్త లోటు    డి) ప్రాథమిక లోటు
 3.    విత్తలోటు నుంచి వడ్డీ చెల్లింపులను తీసి వేస్తే వచ్చేది?
     ఎ) కోశ లోటు     బి) ఆర్థిక లోటు
     సి) రెవెన్యూ లోటు
     డి) ప్రాథమిక లోటు
 4.    దేశీయ కంపెనీలకు, విదేశీ కంపెనీలకు పన్నురేట్లలో తేడా పదిశాతం మించకూడ దని సిఫార్సు చేసింది?
     ఎ) విజయ్‌కేల్కర్     బి) రాజా చెల్లయ్య
     సి) నరసింహం    డి) కె.ఎల్.రేఖీ
 5.    పరోక్ష పన్నులపై సిఫార్సు చేయడానికి ఆర్థిక శాఖ కె.ఎల్.రేఖీ అధ్యక్షతన కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసింది?
     ఎ) 1992 మే    బి) 1992 జూలై
     సి) 1993 మే    డి) 1994 జూలై
 6.    స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
     ఎ) 1994 జూలై 1    బి) 1995 జూలై 1    
     సి) 1996 జూలై 1    డి) 1997 జూలై 1    
 7.    కేంద్ర ప్రభుత్వం ‘కర్ వివాద సమాధాన్’ పథకాన్ని ఎప్పుడు ప్రకటించింది?
     ఎ) 1998 ఆగస్టు 31           బి) 1999 ఆగస్టు 31
     సి) 2000 ఆగస్టు 31     డి) 2001 ఆగస్టు 31
 8.    పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నెలసరి ఆదాయ ఖాతా, పోస్టాఫీస్ పొదుపు ఖాతా లాంటి డిపాజిట్ స్కీములపై సేవింగ్ పరిమితిని పెంచమని సిఫార్సు చేసిన కమిటీ?
     ఎ) రంగరాజన్ కమిటీ     బి) గుప్తా కమిటీ
     సి) వై.వి. రెడ్డి కమిటీ     డి) కేల్కర్ కమిటీ
 9.    14వ ఆర్థిక సంఘం అధ్యక్షులు?
     ఎ) విజయ్ కేల్కర్     బి) నరసింహం    
      సి) వై.వి. రెడ్డి       డి) కె.ఎల్. రేఖీ
 10.    ఉత్పత్తి దశలో, పంపిణీలో వస్తువులకు జతచేరే విలువపై పన్నును ఏవిధంగా వ్యవహరిస్తారు?
     ఎ) విలువ ఆధారిత పన్ను      బి) సేవలపై పన్ను
     సి) సంపద పన్ను             డి) కేంద్ర అమ్మకం పన్ను
 11.    తనకు లభించిన ప్రయోజనంతో సం బంధం లేకుండా ప్రజలందరి ఉపయోగం కోసం ప్రభుత్వం చేసే వ్యయానికి వ్యక్తులు, సంస్థలు చేసే నిర్బంధ చెల్లింపులే పన్ను అని పేర్కొన్నది?
     ఎ) మార్షల్    బి) సెలిగ్మన్
     సి) పిగు          డి) రాబర్‌‌టసన్
 12.    ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వానికి అందించే ద్రవ్య సహాయాన్ని ఏమంటారు?
     ఎ) రుణం     బి) అభివృద్ధి పన్ను
     సి) గ్రాంట్లు    డి) ప్రత్యేక విధింపు
 13.    చెల్లింపు సామర్థ్యం ఆధారంగా విధించే పన్ను విధానం?
     ఎ) పురోగామి         బి) తిరోగామి
     సి) అనుపాత               డి) పైవేవీకాదు
 14.    వినోదం పన్ను దేనికి ఉదాహరణ?
     ఎ) శాశ్వత పన్ను     బి) తాత్కాలిక పన్ను    
       సి) నిర్దిష్ట పన్ను      డి) బహుమతి పన్ను
 15.    లాఫర్ వక్రరేఖ వేటి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది?
     ఎ) రెవెన్యూ లోటు, రెవెన్యూ మిగులు        బి) పన్ను రేటు, పన్ను రాబడి
     సి) నిరుద్యోగం, పేదరికం                        డి) పేదరికం, ద్రవ్యోల్బణం
 16.    వ్యయంపై పన్నును ఏ కమిటీ సిఫార్సులపై ప్రవేశపెట్టారు?
     ఎ) విజయ్ కేల్కర్        బి) రాజా చెల్లయ్య
     సి) కాల్డర్              డి) పిగు
 17.    అంతర్జాతీయ లావాదేవీలన్నింటిపైనా ప న్ను విధిస్తే ఆ దేశానికి పన్ను పెరుగుతుంది అనే భావనకు సంబంధించింది?
     ఎ) టోబిన్ ట్యాక్స్               బి) సంభావనా పన్ను
     సి) నగదు బదిలీ పన్ను       డి) సెక్యూరిటీ లావాదేవీలపై పన్ను
 18.    విలువ ఆధారిత పన్నును సూచించిన వారు?
     ఎ) శామ్యూల్‌సన్         బి) లియాంటిఫ్
     సి) పాల్‌క్రూగ్‌మన్       డి) వాన్‌సెమన్‌‌స
 19.    రాష్ట్ర ప్రభుత్వాల పన్ను రాబడిలో అధిక వాటా కలిగింది?
     ఎ) రాష్ట్ర సొంత పన్నుల రాబడి
     బి) రాష్ట్ర సొంత పన్నేతర రాబడి
     సి) కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు
     డి) వృత్తి పన్ను
 20.    {పణాళికలో ప్రస్తావించని అంశాలపై చేసే వ్యయం
     ఎ) ప్రణాళికా వ్యయం           బి) ప్రణాళికేతర వ్యయం
     సి) రెవెన్యూ వ్యయం              డి) మూలధన వ్యయం
 21.    {పణాళికేతర మూలధన వ్యయానికి ఉదా హరణ?
     ఎ) ప్రభుత్వరంగ సంస్థలకు రుణాలు
     బి) పింఛన్లు        సి) సబ్సిడీలు
     డి) విదేశాలకు ఇచ్చే గ్రాంట్లు
 22.    నూతన ఆస్తుల సృష్టి కోసం జరిగే వ్యయం?
     ఎ) రెవెన్యూ వ్యయం       బి) మూలధన వ్యయం
     సి) సాధారణ పరిపాలనా వ్యయం       డి) పైవేవీ కావు
 
 సమాధానాలు
 1) ఎ;     2) సి;     3) డి;     4) బి; 5) ఎ;    6) డి;     7) ఎ;     8) బి;
 9) సి;     10) ఎ;    11) బి;     12) సి; 13) ఎ;     14) సి;     15) బి;    16) సి;
 17) ఎ;     18) డి;     19) ఎ;     20) బి; 21) ఎ;     22) బి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement