'కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి' | YV Subba reddy questions in loksabha on special status | Sakshi
Sakshi News home page

'కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి'

Dec 17 2015 6:34 PM | Updated on Mar 23 2019 9:10 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వెంటనే అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం లోక్సభలో కేంద్రాన్ని కోరారు.

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వెంటనే అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం లోక్సభలో కేంద్రాన్ని కోరారు. ఎన్నికల సమయంలో ఎన్డీయే మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని, ఇచ్చిన వాగ్థానాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని అన్నారు. ప్రత్యేక హోదా కోసం  ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతోందని, దీనిని కేంద్రం గుర్తించి వెంటనే ప్రత్యేక హోదా ప్రకటన చేయాలని లోక్సభ జీరో అవర్ సమయంలో సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement