కార్పొరేషన్ తీరుపై ఉద్యమిస్తాం: శ్రీధర్ రెడ్డి | ysrcp mla sridhar reddy takes on tdp leaders | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్ తీరుపై ఉద్యమిస్తాం: శ్రీధర్ రెడ్డి

Oct 24 2016 8:12 PM | Updated on Aug 10 2018 9:46 PM

నెల్లూరు కార్పొరేషన్లో ఎస్సీ సబ్ప్లాన్ నిధుల వినియోగంపై అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరోపించారు.

నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్లో ఎస్సీ సబ్ప్లాన్ నిధుల వినియోగంపై అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని మంత్రి నారాయణ పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు.

నిధులున్నా నగరంలోని ఎస్సీ కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టడం లేదని శ్రీధర్ రెడ్డి విమర్శించారు. కార్పొరేషన్ తీరుపై ఉద్యమిస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement