వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా వాహనంపై దాడి | ysrcp mla chand basha vehicle attacked | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా వాహనంపై దాడి

Apr 5 2016 10:34 AM | Updated on May 29 2018 2:33 PM

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా వాహనంపై దాడి - Sakshi

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా వాహనంపై దాడి

అనంతపురం జిల్లా కదిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా వాహనంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు.

అనంతపురం: అనంతపురం జిల్లా కదిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా వాహనంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. తలుపుల ఉరుసు ఉత్సవాల్లో దుండగులు బీభత్సం సృష్టించి, ఎమ్మెల్యే కారు అద్దాలను ధ్వంసం చేశారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. చాంద్ బాషా తలుపుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఫిర్యాదు చేసి 12 గంటలు అయినా పోలీసులు స్పందించలేదు.

చాంద్ బాషా మాట్లాడుతూ.. తన వాహనంపై దాడి చేయడం పిరికిపందల చర్య అని అన్నారు. తనను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక కారు అద్దాలను ధ్వంసం చేశారని విమర్శించారు. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలని, లేకుంటే ఆందోళన చేస్తానని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement