'మా ఓటు మాకు తిరిగిచ్చేసి.. పార్టీ మారండి' | ysrcp leaders takes on MLA Amarnath reddy | Sakshi
Sakshi News home page

'మా ఓటు మాకు తిరిగిచ్చేసి.. పార్టీ మారండి'

Jun 17 2016 11:56 AM | Updated on Sep 4 2017 2:44 AM

'మా ఓటు మాకు తిరిగిచ్చేసి.. పార్టీ మారండి'

'మా ఓటు మాకు తిరిగిచ్చేసి.. పార్టీ మారండి'

టీడీపీలోకి వలస వెళ్లిన చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు.

చిత్తూరు : టీడీపీలోకి వలస వెళ్లిన చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. వీ. కోట మండల కేంద్రంలో అమర్నాథ్ రెడ్డికి వ్యతిరేకంగా ఓ బ్యానర్ను పార్టీ కార్యకర్తలు శుక్రవారం ప్రదర్శించారు. ఆ బ్యానర్లో ఏముందంటే... ఆ రోజు పార్టీలోకి ఎవరూ మిమ్మల్ని రమ్మనలేదు... అలాగే ఈ రోజు మీరు వెళతానంటే ఎవరూ ఆపేది లేదని.. కానీ మిమ్మల్ని మేము ఓట్లు వేసి గెలిపించింది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అని గుర్తుంచుకోండన్నారు.

అమర్నాథ్రెడ్డి గారు మీరు పార్టీ మారతారో లేక గంగలో దూకుతారో మీ ఇష్టం... కానీ మా ఓటు మాకు తిరిగిచ్చేసి పార్టీ మారండి... ఓటర్లుగా మాకు విలువ వుంది. ఓటుకు కూడా ఎంతో విలువ ఉంది. తరచూ పార్టీలు మారే ఎంఎల్ఏగా మీకు విలువుందా ? అని బ్యానర్ ద్వారా ప్రశ్నించారు. సిగ్గు... సిగ్గు.. అని బ్యానర్లో రాసి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement