కాళ్లు పట్టుకో.. వదిలేస్తా | Banner split between TDP and Janasena | Sakshi
Sakshi News home page

కాళ్లు పట్టుకో.. వదిలేస్తా

Sep 11 2024 4:24 AM | Updated on Sep 11 2024 4:24 AM

Banner split between TDP and Janasena

టీడీపీ, జనసేన మధ్య బ్యానర్‌ చిచ్చు.. 

జనసేన నేతలను చితకబాది.. కాళ్లు పట్టించుకున్న టీడీపీ నేతలు

జనసేన నాయకులు ఇద్దరికి తీవ్ర గాయాలు 

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘటన

జనసేన నేతతో కాళ్లు పట్టించుకున్న టీడీపీ నాయకుడు

చిలకలపూడి(మచిలీపట్నం): కూటమిలో వర్గపోరు­కు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బ్యానర్‌ చించిన ఘటనలో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. టీడీపీ నేత ఒకరు రంగప్రవేశం చేసి, జనసేనలోని ఓ వర్గం నాయకుడితో కాళ్లు పట్టించుకొని ఆధిక్యాన్ని ప్రదర్శించారు. చివరకు పరస్పరం కేసులు పెట్టుకున్నారు.

ఇదీ జరిగింది..
కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరం పరాసుపేట సెంటరులో జనసేన పార్టీకి చెందిన ఓ వర్గం నాయ­కులు వినాయక చవితి సందర్భంగా విగ్ర­హాన్ని ఏర్పాటు చేసి బ్యానరు కట్టారు. ఈ బ్యానర్‌లో అదే పార్టీకి చెందిన యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావు ఫోటోలు లేవు. తమ ఫొటోలు లేకుండా తమ నుంచి  చందాలు ఎలా తీసుకుంటారని నాని సోమవారం అక్కడి నిర్వాహకులను ప్రశ్నించారు. అక్కడి బ్యానర్‌ను నాని చేతితో కొట్టడంతో అది చిరిగిపోయింది. 

దీంతో బ్యానర్‌ ఏర్పాటు చేసిన వర్గం నానితో వాగ్వాదానికి దిగింది. నాని క్షమాపణ చెప్పడంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది. సోమవారం సాయంత్రం నాని మద్యం సేవించి వచ్చి ఆ బ్యానర్‌ను పూర్తిగా చించేశాడు. దీంతో బ్యానర్‌ ఏర్పాటు చేసిన జనసేన నాయకులు యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావు ఇళ్లకు వెళ్లి సామాన్లను ధ్వంసం చేశారు. వారిద్దరినీ రక్తం వచ్చేలా తీవ్రంగా కొట్టి వచ్చేశారు. 

నాని తిరిగి తమపై దాడి చేస్తారన్న భయంతో టీడీపీ నాయకుడు శంకు శ్రీను, మరికొందరిని తీసుకొని నాని, శ్రీనివాసరావు ఇళ్లకు వెళ్లారు. వారిద్దరినీ కా ళ్లతో తంతూ చితకబాదారు. జనసేన నాయకుడు నాని టీడీపీ నాయకుడు శంకు శ్రీనును కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పేంత వరకు వదల్లేదు. చివరికి రెండు వర్గాలు పరస్పరం కేసులు పెట్టుకున్నాయి. ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు చిలకలపూడి సీఐ అబ్దుల్‌ నబీ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement