అంబేద్కర్‌ అందరివాడు | YSRCP Leaders pay tributes to Dr. B.R Ambedkar | Sakshi
Sakshi News home page

అంబేద్కర్‌ అందరివాడు

Apr 14 2017 5:18 PM | Updated on Aug 17 2018 8:11 PM

అంబేద్కర్‌ అందరివాడని ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఎస్‌ఐ రామానాయక్‌ అన్నారు.

కంభం: అంబేద్కర్‌ అందరివాడని ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఎస్‌ఐ రామానాయక్‌ అన్నారు. స్థానిక కందులాపురం కూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద షెడ్యూల్డ్‌ కులాల పరిరక్షణ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు కాటమాల చెన్నకేశవరావు అధ్యక్షతన అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమం నిర్వహించారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో కందులాపురం కూడలి నుంచి తహశీల్దార​ కార్యాలయం మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి షాలెంరాజు, బీఎస్పీ జిల్లా కార్యదర్శి పానుగంటి సతీశ్‌, మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు కల్వకూరి అబ్రహం, అంబేద్కర్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కన్వీనర్‌ చింతల అరుణ్‌దీప్‌, ఎన్జీఓ ఏలియా, సీఐటీయూ నాయకుడు దాసరిరెడ్డి, పీపుల్స్‌ యాక‌్షన్‌ ఫోరం నాయకుడు పులుగుజ్జు సురేశ్‌, కంభం, కందులాపురం సర్పంచులు స్టార్‌బాషా, మెర్సికమల తదితరులు పాల్గొన్నారు. వాసవీ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ గోళ్ల సుబ్బరత్నం సిబ్బందితో కలిసి కందులాపురం కూడలిలో అంబేద్కర్‌కు నివాళులర్పించారు.

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో: వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి చెన్ను విజయ ఆధ్వర్యంలో కంభం, అర్ధవీడు మండలాల వైఎస్సార్‌సీపీ నాయకులు ర్యాలీగా వచ్చి కందులాపురం కూడలిలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కంభం మండల రూరల్‌ లాయర్‌ శ్రీనివాసులరెడ్డి, నాయకులు సి.హెచ్‌. వెంకటేశ్వర్లు, గర్రె వెంకటేశ్వర్లు, పఠాన్‌ జఫ్రుల్లా ఖాన్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement