గుంతలు పూడ్చాలని వైఎస్సార్‌సీపీ రాస్తారోకో | YSR Congress Party Rasta Rocco | Sakshi
Sakshi News home page

గుంతలు పూడ్చాలని వైఎస్సార్‌సీపీ రాస్తారోకో

Feb 4 2017 10:03 PM | Updated on May 25 2018 9:20 PM

గుంతలు పూడ్చాలని వైఎస్సార్‌సీపీ రాస్తారోకో - Sakshi

గుంతలు పూడ్చాలని వైఎస్సార్‌సీపీ రాస్తారోకో

మండలంలోని కటికెనపల్లి నుంచి ధర్మారం వరకు రహదారిపై పడిన గుంతలను పూడ్చాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు

ధర్మారం: మండలంలోని కటికెనపల్లి నుంచి ధర్మారం వరకు రహదారిపై పడిన గుంతలను పూడ్చాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నగేష్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కటికెనపల్లి బస్టాండు వద్ద రాస్తారోకో చేశారు. ఆందోళన కాంగ్రెస్‌ నాయకులు మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై హరిబాబు సంఘటన స్థలానికి చేరుకుని రాస్తారోకో విరమించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ నగేష్‌ మాట్లాడుతూ కరీంనగర్‌ నుంచి రాయపట్నంవరకు ఉన్న స్టేట్‌హైవే గుంతలమయంగా మారి ప్రయాణికులకు ఇబ్బందులు కల్గుతున్నాయన్నారు.

కటికెనపల్లినుంచి ధర్మారం వరకు రోడ్డు పూర్తిగా శిథిలమై గుంతలు ఏర్పడటంతో రోడ్డు ప్రమాదకరంగా ఉందని తెలిపారు. పలు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు స్పందించడంలేదని పేర్కొన్నారు. ఈవిషయమై చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వం యంత్రాంగం తక్షణమే స్పందించి మరమ్మతు చేయాలని డిమాండ్‌ చేశారు.   వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గోపాల్‌రెడ్డి, సంపంగి సతీష్, రాము, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్, నాయకులు మహేందర్, సంతోష్, మనోజ్, సంజీవ్, రాజు, కుమార్, శ్రీనివాస్, రాజేశ్, ఆవుల వేణు, కనుకయ్య, నాగరాజు, తిరుపతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement