బాధిత కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ పరామర్శ | ys jagana consoles rajavommangi victims | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ పరామర్శ

Dec 7 2016 4:48 PM | Updated on May 25 2018 9:20 PM

బాధిత కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ పరామర్శ - Sakshi

బాధిత కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ పరామర్శ

శిశు మరణాలు సంభవించడంపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు

రంపచోడవరం: కనీస వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం శిశు మరణాలు సంభవించడంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురవుతున్న పశ్చిమగోదావరి జిల్లాలోని నాలుగు మండలాల్లో వైఎస్‌ జగన్‌ బుధవారం నుంచి రెండురోజుల పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే.

సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, పౌష్టికాహారం అందకపోవడం వల్ల ఒక్క రాజవొమ్మంగిలోనే వారం నుంచి రెండు నెలల వయస్సులోపు 15 మంది చిన్నారులు చనిపోయారని వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాజవొమ్మంగి మండలంలోపరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడాన్ని ఆయన దుయ్యబట్టారు. కనీస వైద్య సదుపాయాలు లేక ఇక్కడ నిరుపేదలు అనేక కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి రూ. 1300 కోట్లు అవసరమైతే రూ. 780 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఇస్తున్నదని తప్పుబట్టారు. తాను ఇటీవల సీఎం చంద్రబాబుకు లేఖ రాశాక ఆరోగ్యశ్రీకి రూ. 262 కోట్లు ఇచ్చారని గుర్తుచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement