నాలుగేళ్ల ఎదురుచూపులు ఫలించాయి | YS Jagan Mohan Reddy meet dastagiramma | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల ఎదురుచూపులు ఫలించాయి

Dec 25 2016 4:13 PM | Updated on Apr 4 2018 9:25 PM

నాలుగేళ్ల ఎదురుచూపులు ఫలించాయి - Sakshi

నాలుగేళ్ల ఎదురుచూపులు ఫలించాయి

వైఎస్‌ కుటుంబమంటే ఎనలేని అభిమానం.. వైఎస్‌ జగన్‌ అంటే అంతులేని ప్రేమతో

సాక్షి, కడప: వైఎస్‌ కుటుంబమంటే ఈ వృద్ధ మహిళకు ఎనలేని అభిమానం....వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంటే అంతులేని ప్రేమ... వైఎస్సార్‌ జిల్లా బొజ్జవారిపల్లెకు చెందిన దస్తగిరమ్మ(70) అనే ఆ మహిళ దాదాపు నాలుగేళ్లక్రితం నాటి పాలకుల కుట్ర ఫలితంగా జగన్‌మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లినప్పుడు తల్లడిల్లిపోయింది. జగన్‌ త్వరగా బయటికి రావాలని, అలా వస్తే మాబు సుబ్‌హాని దర్గాలో తులాభారం కింద ఎంత బరువుంటే అంత లడ్డూ చెల్లిస్తానని మొక్కుకుంది. తర్వాత జగన్‌ బెయిల్‌పై బయటికొచ్చారు. కానీ దస్తగిరమ్మ మొక్కు అలాగే ఉండిపోయింది. వైఎస్సార్‌సీపీ నాయకులు గ్రామంలోకొస్తే చాలు జగన్‌ను పిలుచుకురారా? అంటూ వేడుకునేది. ‘గడపగడపకు వైఎస్సార్‌’ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి బొజ్జవారిపల్లె గ్రామానికి వెళ్లినప్పుడు దస్తగిరమ్మ తన మొక్కు గురించి వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement