వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు | ys jagan mohan reddy diwali greetings in advance | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు

Oct 29 2016 10:30 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు - Sakshi

వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని వైఎస్ జగన్  ట్విట్ చేశారు.

ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందాల కోటి కాంతులు నింపాలని వైఎస్ జగన్  ఆక్షాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement