మదనపల్లె శాసనసభ్యులు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఇంట ఆయన కుమార్తె పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అంగళ్లు గోల్డెన్ వ్యాలీ ప్రాంగణం లో శనివారం రాత్రి జరిగిన వివాహ వేడుక కు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, విపక్షనేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి,
సాక్షి ప్రతినిధి, తిరుపతి: మదనపల్లె శాసనసభ్యులు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఇంట ఆయన కుమార్తె పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అంగళ్లు గోల్డెన్ వ్యాలీ ప్రాంగణం లో శనివారం రాత్రి జరిగిన వివాహ వేడుక కు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, విపక్షనేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, పలువురు శాసనసభ్యులు హాజరై నూతన వధూవరులు డాక్టర్ కరిష్మాదేశాయ్, లక్ష్మీకాంతరెడ్డిలను ఆశీర్వదించారు. పులివెందుల నుంచి నేరుగా మదనపల్లి చేరుకున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముందుగా పట్టణంలోని పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షమీమ్ అస్లాం ఇంటికెళ్లి వారి కొడుకు, కోడలికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా అంగళ్లులోని దేశాయ్ వారి వివాహ ప్రాంగణానికి చేరుకుని కొత్త జంటను అభినందించారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ నాయకులు వైఎస్ జగన్‌ను కలిసేందుకు ఆసక్తి చూపారు. ఆయన వెంట
ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, చెవి రెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి, పీలేరు, పూతలపట్టు, రైల్వే కోడూరు, నర్సరావుపేట శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి, సునీల్‌కుమార్, కొరముట్ల శ్రీనివాసులు, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చిత్తూరు, సత్యవేడు, పలమనేరు, తంబళ్లపల్లి పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులు జంగాలపల్లి శ్రీనివాసులు, ఆదిమూలం, రెడ్డెమ్మ, సీవీ కుమార్, రాకేశ్‌రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి ఉన్నారు.