యువకులు క్రీడల్లో రాణించాలి | youth to Excelled in sports | Sakshi
Sakshi News home page

యువకులు క్రీడల్లో రాణించాలి

Aug 14 2016 11:34 PM | Updated on Sep 4 2017 9:17 AM

యువకులు క్రీడల్లో రాణించాలి

యువకులు క్రీడల్లో రాణించాలి

చందుపట్ల(భువనగిరి అర్బన్‌) : గ్రామీణ యువకులు క్రీడా రంగంలో ముందుండి మండలానికి మంచి పేరు తీసుకరావాలని సర్పంచ్‌ చిన్నం శ్రీనివాస్‌ అన్నారు.

చందుపట్ల(భువనగిరి అర్బన్‌) : గ్రామీణ యువకులు క్రీడా రంగంలో ముందుండి మండలానికి మంచి పేరు తీసుకరావాలని సర్పంచ్‌ చిన్నం శ్రీనివాస్‌ అన్నారు. భువనగిరి రూరల్‌ పోలీస్, కూనూరు గ్రామ సోల్జర్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం చందుపట్ల గ్రామంలో నిర్వహించిన మండల స్థాయి క్రీడాపోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇందులో భాగంగా ఈ పోటీలకు మండలంతో పాటు ఇతర మండలాల నుంచి మొత్తం 20 టీంలు వచ్చినట్లు తెలిపారు. పోటీలలో గెలుపొందిన వారికి ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవం కార్యక్రమం అనంతరం బహుమతులను అందజేయనున్నట్లు పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు బల్గూరి మధుసూదన్‌రెడ్డి, అధ్యక్షుడు పాశం శివానంద్, సభ్యులు గుర్రం ప్రమోద్, చిన్నం తిరుమల్, మధుసూదన్‌ తదితరులు ఉన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement