అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి | youth suspicious dead in guntur district | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

Oct 30 2015 11:44 AM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లాలో ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు.

నర్సారావుపేట: గుంటూరు జిల్లాలో ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. నర్సారావుపేట మండలం అచ్చమ్మపాలెంలో వ్యవసాయ బావిలో శుక్రవారం ఉదయం అచ్చి వెంకటేశ్వర్లు మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. మృతదేహాన్ని రైతులు బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు.

గురువారం జరిగిన ఓ ఫంక్షన్ నుంచి వెంకటేశ్వర్లును ముగ్గురు స్నేహితులు తీసుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో స్నేహితులే వెంకటేశ్వర్లును హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement