నడిరోడ్డుపై యువకుడి ఆత్మహత్య | Youngster commits suicide on middle of street | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై యువకుడి ఆత్మహత్య

Oct 28 2015 6:16 PM | Updated on Oct 1 2018 6:38 PM

పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన యువకుడు నడిరోడ్డుపై మృతిచెందాడు.

వింజమూరు(నెల్లూరు): పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఓ యువకుడు నడిరోడ్డుపై మృతిచెందాడు. రోడ్డు మీద పడి కొట్టకుంటున్నా స్థానికులు ఎవరూ స్పందించకపోవడంతో.. అక్కడే మృతిచెందాడు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరు జిల్లా వింజమూరు బంగ్లాసెంటర్‌లో బుధవారం జరిగింది.

వివరాలు.. కొండాపురం మండలం గొట్టికొండాల గ్రామానికి చెందిన మౌలాలి(28) తాపి మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు బంగ్లా సెంటర్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement