బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు.. | young man death with heart stroke | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

Feb 20 2018 1:24 PM | Updated on Aug 1 2018 2:31 PM

young man death with heart stroke - Sakshi

ముదిన వెంకటాచారి (ఫైల్‌)

పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఆడుతూ గుండెపోటుకు గురై యువకుడు మృతిచెందిన ఘటన ద్వారకాతిరుమల మండలం సత్తెన్నగూడెంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ద్వారకాతిరుమలకు చెందిన ముదిన వెంకటాచారి (38) లింగపాలెం మండలం రంగాపురంలో విద్యుత్‌శాఖ ఆర్‌సీ (బిల్లు కలెక్టర్‌)గా పనిచేస్తున్నారు.

షటిల్‌పై ఆసక్తితో స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి సత్తెన్నగూడెంలో జరుగుతున్న టోర్నమెంట్‌కు వెళ్లారు. అక్కడ షటిల్‌ ఆడుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై సేదతీరుతుండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. సహచరులు హుటాహుటిన ద్వారకాతిరుమలలో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు జరిపిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులులు ఉన్నారు. చారీ గతంలో ప్రముఖ దినపత్రికలో కొంతకాలం విలేకరిగా పనిచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement