ఈ.తాండ్రపాడు గ్రామానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు కూతురు సాయిలక్ష్మి (18) ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
యువతి ఆత్మహత్య
Jan 30 2017 12:15 AM | Updated on Nov 6 2018 7:53 PM
కర్నూలు : ఈ.తాండ్రపాడు గ్రామానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు కూతురు సాయిలక్ష్మి (18) ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పంచలింగాల వద్ద ఉన్న టీటీసీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ ఉండేది. తండ్రి వెంకటేశ్వర్లు ఆల్కాలిస్ ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్నాడు. తల్లి కూలీ పనికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు బిగించుకుని చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు.
Advertisement


